సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
139

భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్.వై.పి.ఎస్.ఎన్. ఫౌండర్ నిసార్ యాసిన్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. శిబిరంలో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను వైద్యులు పరిశీలించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ వాసులు, శ్రీ మారెమ్మ స్వామి కమిటీ సభ్యులు శిబిరం నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
సిరిసిల్ల : తీవ్ర విషాదం...5 రోజుల పసికందు మృతి..!
రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లి మాప్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష డెలివరీ...
By Sunka Santhosh 2026-04-08 12:15:43 0 250
Andhra Pradesh
Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్.
Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్ 17-03-2026 Tue 15:45 | Andhra...
By Pagadala Venkateswar 2026-03-17 10:43:51 0 228
Andhra Pradesh
పుంగునూరులో చీపురు పట్టిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి
స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్...
By Kothuru Murali 2026-05-23 14:13:50 0 130
Andhra Pradesh
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు...
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్...
By Gadiyapudi Narendra 2026-01-04 16:19:40 0 579
Goa
Goa Job Drive: Government Accelerates State Recruitment
The Government of Goa is actively ramping up its recruitment drive to fill various vacancies...
By Lokeshwari Panthadi 2026-06-30 04:28:14 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com