బీసీల హక్కుల కోసం ధర్మపోరాటం ఆసిఫాబాద్‌లో నేడు మహా దీక్ష

0
308

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): బీసీ సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను కేటాయించాలని, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్‌ను కేటాయించి శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని, నిర్ణయాలను నిరసిస్తూ శుక్రవారం ఆసిఫాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద భారీ "ధర్మ పోరాట దీక్ష"ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

బీసీల రాజకీయ, విద్యా, ఉద్యోగ హక్కుల సాధనకై చేపట్టే ఈ ధర్మపోరాట దీక్షకు జిల్లాలోని బీసీ ప్రజాసంఘాలు, యువకులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రూప్నర్ రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
APSRTC ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ
APSRTC(PTD) ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్.(ఏఐటీయూసీ అనుబంధం).   రాష్ట్ర వ్యాప్తంగా...
By Rajini Kumari 2025-12-29 08:41:59 0 209
Andhra Pradesh
మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.
మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:02:45 0 197
Telangana
బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి...
By Sidhu Maroju 2025-08-18 15:48:45 0 674
SURAKSHA
Priyanka Ala, IAS: A Visionary Leader Driving Good Governance
Committed to Transparent Administration, Citizen-Centric Governance, and Sustainable Development...
By Lokeshwari Panthadi 2026-07-10 11:16:07 0 138
Telangana
"బోయిన్‌పల్లి పరిధిలో డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మల్కాజిగిరి జోన్ పోలీసులు మంగళవారం...
By Sidhu Maroju 2026-04-15 16:53:48 0 405
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com