ఆసిఫాబాద్‌లో ఘనంగా బిజెపి సేవా సంకల్ప్ అభియాన్ వర్క్ షాప్ మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తింపుగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు

0
243

🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో  సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా స్థాయి వర్క్ షాప్ సమావేశం ఘనంగా జరిగింది. బిజెపి జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం అధ్యక్షతన, జిల్లా కన్వీనర్ కోవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు చేపట్టబోయే కార్యక్రమాలను ఖరారు చేశారు.

ఈ అభియాన్‌లో భాగంగా సెప్టెంబర్ 17న లబ్ధిదారుల ఇళ్లలో ఆశీస్సుల దీపం వెలిగించడం, విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు, గ్రామాలల్లో 18-20 కళాబృందాలతో  నమో సేవ గాధ వీధి నాటకాలు ప్రదర్శించనున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఉత్సవాలు, తల్లులతో మాతృ సంవాదం, లబ్ధిదారుల విజయాలపై 60 సెకన్ల వీడియో రీల్స్, మరియు అభివృద్ధి ప్రచారం కోసం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సేవా జ్యోతి యాత్రలు నిర్వహించనున్నారు. వీటితో పాటు రక్తదానం, స్వచ్ఛత వంటి 25 రకాల సేవా కార్యక్రమాలు చేపట్టి 'మై భారత్' పోర్టల్ ద్వారా సర్టిఫికేట్లు అందజేస్తారు. ప్రజల కోసం నియోజకవర్గ, మండల స్థాయిల్లో సేవా సేతు శిబిరాలు ఏర్పాటు చేసి కేంద్ర పథకాల రిజిస్ట్రేషన్లు అక్కడికక్కడే చేయనున్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగేలా మల్లికార్జున్, రాపర్తి ధనుంజయ్, జిల్లా పదాధికారులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.
మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్...
By Pagadala Venkateswar 2026-03-01 04:17:20 0 227
Andhra Pradesh
కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి...
By Ratna Sekhar 2026-02-19 20:17:49 0 1K
International
War effect in india
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరియు ముఖ్యంగా భారతదేశంపై పడే ప్రభావాలు చాలా...
By G k Nookala 2026-03-01 08:01:18 0 175
Bharat Aawaz
“You Are Not Just a Voter – You Are the Owner of This Nation”
Know Your Rights. Use Your Voice. Change Your India.  Why This Article Matters Most people...
By Citizen Rights Council 2025-06-25 11:53:49 0 2K
Andhra Pradesh
మెగా డిఎస్సి పై విషప్రచారాన్ని వైసీపీ మానుకోవాలి. గండికోట సుధాకర్
      రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో...
By Benguluri Madhubabu 2026-08-11 09:32:04 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com