శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్

0
130

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  దర్ని మధుకర్  స్థానిక కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి గారితో కలిసి ఈ రోజు ప్రారంభించారు,మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక కృషి ఫలితంగా మంచిర్యాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే నాల్గవ సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా మేయర్  దర్ని మధుకర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, విద్యాభ్యాసంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని అన్నారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని మేయర్ గారు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల సంక్షేమం కోసం తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు,విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, హరే కృష్ణ ఫౌండేషన్‌కు, అలాగే సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు కృషి చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకి ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ పరిధిలోని కనాజిగూడ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న డాక్టర్...
By Sidhu Maroju 2026-04-03 13:41:00 0 252
Telangana
మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గుండెపోటు
పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ...
By Gujile Ramu 2026-07-26 04:20:03 0 182
Andhra Pradesh
సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి మాజీ ఎంపీ కంభంపాటి పరామర్శ
పత్రికా ప్రకటన    మచిలీపట్నం డిసెంబర్ 28: -----------   రాష్ట్ర ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-29 09:34:24 0 211
PRAGATI
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact Your Local Voice Can Create National...
By PRAGATI 2025-04-30 11:44:14 0 6K
Andhra Pradesh
శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ జట్టుకు ఎంపిక.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి. శశాంక్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-04-11 12:48:44 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com