శ్రీ మహంకాళి ఆషాడ బోనాల సందర్భంగా పలు శాఖలతో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం

0
1K

సికింద్రాబాద్. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని  ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత,స్థానిక కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ ,మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,కోట నీలిమ వివిధ విభాగాల అధికారులు,ముఖ్య నేతలు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

చరిత్రాత్మకమైన మహిమ గల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందాం. ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన, స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదు. గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకుని మరిన్ని మంచి జరిగే ఏర్పాట్లు చేయడానికే ఈ సమీక్ష. దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయ ఈవో ని కోరుతున్న, ఆలయం లోపల కేబుల్ వైర్ లు కొత్తవి వేసి ఇబ్బందులు.. ప్రమాదాలుజరగకుండా చూసుకోవాలి. అలాగే భారీ కేడింగ్ జాలి ఏర్పాటు చేయాలి. ఆతిధ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికి తీసి పోరని తెలియజేయాలి. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు స్థానిక హైదరాబాద్ ప్రజలు వారికి ఘనమైన ఆతిధ్యం ఇవ్వాలి.  ఏ ఏ పండగలు ఆయా ఏరియాలలో జరుగుతున్నందున వాటర్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అవసరమైతే రెండు సార్లు నీళ్లు ఇవ్వండి. హైదరాబాద్ మొత్తం ఒకే సారి అయితే కొంత ఇబ్బంది ఉంటుంది.. కానీ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉంటుంది. భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి. 3600 దేవాలయాలకు సంబంధించి సమీక్షా సమావేశం రాష్ట్ర స్థాయి అధికారులతో జరిగింది. గోల్కొండ ,ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట , లాల్ దర్వాజా ఇలా ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. జోగిని వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. బోనం ఎత్తుకునే వారే మాకు ప్రథమ ప్రాధాన్యత. బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపి లు వస్తే ఇబ్బందులు ఉండవు. ఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి. డెక్కన్ మానవ సేవ సమితి , ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాయి. అందరూ వారి వారి సహకారం అందించి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలి.. అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులను వైకాపా మోసం చేసిందన్న కేంద్ర సహాయ మంత్రి
ఆచంట, పెనుగొండ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని కేంద్ర సహాయ మంత్రి...
By Bharat Aawaz 2025-08-14 10:24:38 0 506
Andhra Pradesh
కడప - బద్వేల్ రోడ్డు మార్గంలో.. కల్వర్టు కూలడంపై స్పందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కడప-బద్వేల్ రోడ్డు కల్వర్టు కూలిపోవడంపై మంత్రి ఆదేశాలు కడప-బద్వేల్ రోడ్డులో, లంకమల అటవీ...
By Pulse 2025-08-12 10:33:54 0 601
Telangana
అల్వాల్ లో ఘనంగా స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
                  మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-08-18 16:31:05 0 412
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని...
By Sidhu Maroju 2025-06-08 08:54:09 0 1K
Sports
India’s First-Ever International Javelin Event
The Neeraj Chopra Classic 2025 matters a lot not just as a sports event, but as a powerful symbol...
By Bharat Aawaz 2025-07-04 05:16:26 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com