విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అండ

0
99

 

*రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత – కుటుంబంలో ఒకరికి ఉద్యోగం హామీ*

 

 *అన్నమయ్య జిల్లా*

*రాయచోటి నియోజకవర్గం*

*సంబేపల్లి | 05-09-2026*

 

సంబేపల్లి మండలంలో ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అండగా నిలిచారు. ఘటనపై స్పందించిన మంత్రి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు *రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని,* కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

 

మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బాధిత కుటుంబ సభ్యులకు *రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవిగారి తో కలిసి అందజేశారు*. కష్టకాలంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి తెలిపారు.

 

బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే హామీని కూడా త్వరితగతిన అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజల కష్టాల్లో వారికి తోడుగా నిలిచి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
(SIR)ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఆసిఫాబాద్, జూలై 11 : భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు పూర్తి...
By Avunoori Mahesh 2026-07-11 11:35:31 0 316
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు పట్టణంలో ఇంటింటికీ బీసీ చైతన్యం కార్యక్రమం
పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో 'ఇంటింటికీ బీసీ చైతన్యం' కార్యక్రమం సోమవారం...
By Kothuru Murali 2026-03-31 04:21:10 0 199
Telangana
వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం
  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్...
By Bheeshman King 2026-04-10 11:43:46 0 666
Andhra Pradesh
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*       *ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *కిడ్నీ...
By Rajini Kumari 2026-01-10 12:33:47 0 220
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె యోగిత హోటల్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.
 Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్‌లో...
By Pagadala Venkateswar 2026-09-19 06:18:31 0 35
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com