Madanapalle: మదనపల్లె యోగిత హోటల్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.
Posted 2026-09-19 06:18:31
0
30
Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్‌లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 4:50 గంటల సమయంలో హోటల్‌లో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఇన్‌చార్జ్ అగ్నిమాపక కేంద్రాధికారి జె. బాబయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన పొగతో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని హోటల్ యజమాని ఎస్‌పి పృథ్వీరాజ్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 7లోపు దరఖాస్తు చేయండి.
మదనపల్లె అర్బన్ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు తమ ఆన్సర్ షీట్ల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం...
పుంగనూరు: అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో సోమవారం మధ్యాహ్నం నక్కబండ, జగనన్న కాలనీ ప్రజలకు...
విజయవాడ ను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుదాం
*ప్రెస్ నోట్*
*6-6-26*
*విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం*
...
Monita Borgohain IAS: Leading Assam with Vision
A Distinguished Administrator Driving Good Governance, Administrative Reforms, and Public Service...
మాజీ సీఎం ని కలిసిన రహుల్ల గారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు ...