కేటీఆర్ కారుకు తృటిలో ప్రమాదం.. లారీ ఢీ.|

0
126

● అలుగునూర్ వద్ద ఘటన.. కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు

● కారు వెనుక డోర్‌ను ఢీకొట్టిన లారీ

● గతంలోనూ కేటీఆర్ పర్యటనల్లో ప్రమాద ఘటనలు

ఆల్వాల్, సెప్టెంబర్ 5: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ పర్యటనలో తృటిలో ప్రమాదం తప్పింది. అలుగునూర్ చౌరస్తా వద్ద కేటీఆర్ ప్రయాణిస్తున్న కారు వెనుక డోర్‌ను పక్కగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. 

ఈ సమయంలో కేటీఆర్ కారులోనే ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనలో కారు డోర్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

కరీంనగర్‌లో నిర్వహించిన యువ సమరభేరి కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేటీఆర్ కాన్వాయ్‌తో వెళ్తున్నారు. అలుగునూర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. 

అనంతరం కేటీఆర్ కారులోకి ఎక్కి బయలుదేరే సమయంలో వెనుక డోర్ తెరిచి ఉండగా అటుగా వెళ్తున్న లారీ దానిని ఢీకొట్టింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని అదుపులోకి తీసుకున్నాడు.

ప్రమాదం జరిగినప్పటికీ కేటీఆర్ తన పర్యటనను కొనసాగించారు. అనంతరం కరీంనగర్‌లో జరిగిన యువత, విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, గతంలోనూ కేటీఆర్ పర్యటనలకు సంబంధించిన కాన్వాయ్‌లలో ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. 

2025 మార్చిలో కరీంనగర్ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను ఓ బీఆర్‌ఎస్ కార్యకర్త బైక్ ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. 

అలాగే 2026 జూలైలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో కేటీఆర్ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయాలయ్యాయి.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
భూమి తగాదాలతో వృద్ధుడిపై దాడి.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కోటగ్రామంలోని బి. ఎస్. ఆర్. వడ్డేపల్లి కు చెందిన...
By Pagadala Venkateswar 2026-07-14 06:48:56 0 78
Telangana
కరీంనగర్ : రోడ్డు పై బైఠాయించి కొడుకుపై తల్లి ధర్నా ..!
ఆస్తిని  లాక్కున్న కొడుకు 20 ఏళ్లుగా తనకు కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్నారని రాయికల్...
By Sunka Santhosh 2026-05-16 07:04:20 0 184
SURAKSHA
Dr. Lakshmisha G. IAS: Driving Excellence in Governance
A distinguished 2011-batch Andhra Pradesh cadre IAS officer, Dr. Lakshmisha G. has earned...
By Lokeshwari Panthadi 2026-07-16 11:47:12 0 338
Telangana
సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా, మే 14: సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు...
By Avunoori Mahesh 2026-05-14 06:09:11 0 209
Andhra Pradesh
ఆడపిల్లల విద్యాభివృద్ధి దిశగా కీలక అడుగు – జడవల్లి అడ్డరోడ్డులో మద్రసా హాస్టల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ.
పొన్నూరు మండలం, జడవల్లి గ్రామ సమీపంలో ముఫ్తి అబ్దుల్లా బేగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్...
By John Baji 2026-02-03 11:26:40 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com