రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.

0
104

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు, అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

 

 

నిన్న ఉదయం నుంచే తిరుపతి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ విస్తృత సోదాలు నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ తనిఖీల్లో దాదాపు రూ. 5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తనిఖీల సమయంలో ఆయన నివాసంలో 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ. 12.50 లక్షల ద్రవ్య నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

 

వీటితో పాటు ఆయన భార్య, కుమారుడి పేర్లతో పలుచోట్ల ఇళ్లు, విలువైన స్థలాలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిన్న ప్రారంభమైన సోదాలు ముగిసిన వెంటనే, ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు. టీటీడీ కీలక అధికారిని ఏసీబీ అరెస్ట్ చేయడం ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది.

Search
Categories
Read More
Telangana
ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొన్న ఎంమ్మెల్యే
మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ,హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో...
By Avunoori Mahesh 2026-04-13 10:34:05 0 175
Telangana
వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామసభలో వరంగల్ జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికల భాగంగా.... భారత్ అవాజ్ న్యూస్: 8 జూన్ రోజున...
By Gujile Ramu 2026-06-08 07:49:31 0 222
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ కమిషనర్
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న...
By Kothuru Murali 2026-03-11 11:04:41 0 240
Andhra Pradesh
ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా...
By Gadiyapudi Narendra 2026-03-17 11:50:35 0 630
Telangana
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు...
By Sidhu Maroju 2025-12-07 14:40:03 0 320
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com