ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

0
624

బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్ల భవన సముదాయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. 
        కలెక్టరేట్ కు వచ్చే ప్రజల కొరకు సామాజిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సామాజిక మరుగుదొడ్లు   నిర్మిస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్ కార్పొరేషన్ నుంచి రూ.21లక్షలు, డి ఎం ఎఫ్ నిధి నుంచి రూ.9 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రూ.30 లక్షల నిధులతో నిర్మిస్తున్న 20 మరుగుదొడ్లు, 20 యూరినల్స్, సింక్ లు, కొళాయి కనెక్షన్లు, నీటి వసతి సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, యూరినల్స్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించిన ఆయన  ప్రహరీ గోడ నిర్మించాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు ఉండాలని సూచించారు. భవన సముదాయంలో ఎగ్జిస్టెడ్ ఫ్యాన్లు, వంటి తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. భవన సముదాయానికి బోర్డు, ప్రహరీ గోడ వెలుపల వైపు చిత్రాలు వేయించాలని, వారంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ అనంతరాజు, డీఈ, ఎఇ, గుత్తేదారుడు, తదితరులు ఉన్నారు.

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Telangana
హైదరాబాద్‌ను చుట్టేసిన పాములు..|
"జూన్‌లోనే 1,300కుపైగా పాముల రెస్క్యూ.. వర్షాలతో జనావాసాల్లోకి విషసర్పాల ప్రవేశం."...
By Sidhu Maroju 2026-06-29 16:58:19 0 132
Uttarkhand
Uttarakhand Goes Green: Cabinet Mandates "No Vehicle Day"
In a bold move to combat the global energy crisis, Chief Minister Pushkar Singh Dhami’s...
By Dunna Jessicaruth 2026-05-14 09:01:52 0 170
Telangana
నిజామాబాద్:
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
By Sadaq Sadaq 2026-05-13 04:16:07 0 158
Andhra Pradesh
పెద్దమండెం.జిల్లా ఉత్తమ ఎంఈఓ గా మనోహర్
పెద్దమండ్యం మండల విద్యాశాఖాధికారి మనోహర్‌కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు గాను...
By Pagadala Venkateswar 2026-01-26 05:36:45 0 205
Telangana
పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?
వందల కోట్ల బడ్జెట్.. కొత్త కట్టడాలు.. ఆర్భాటపు ప్రచారాలు.. కట్ చేస్తే, కనీసం వంద రోజులు కూడా...
By Ponnala Srinivasrao 2026-04-03 15:18:46 0 261
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com