ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.

0
95

ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం కీలకమైన ప్రాధాన్యాన్ని అప్పగించింది. ప్రధానమంత్రి మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలకు దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా ఆయనను నియమించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ, ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో విస్తృత ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.

 

 

ప్రజాసేవ, దేశాభివృద్ధి సహా ‘వికసిత్ భారత్–2047’ సంకల్పాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి వినూత్న ప్రజా భాగస్వామ్య సేవలను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాల సమన్వయం, అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి సత్యకుమార్ దగ్గరుండి చూడనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో నూతన ఆటో స్టాండ్ ప్రారంభం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు...
By Kothuru Murali 2026-07-09 11:34:39 0 197
Andhra Pradesh
నిమ్మనపల్లిలో ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయి ఓ మహిళ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-22 12:38:39 0 214
Andhra Pradesh
పులికొండ ప్రాజెక్ట్ రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి యర్రగొండపాలెం నియోజకవర్గం,...
By Chennaiah Kati 2026-06-27 16:50:53 0 118
Telangana
మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి
మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి ఈనెల 14న మందమర్రి ఏరియాలో అంబేద్కర్ 135వ జయంతి...
By Pinnehasan Odela 2026-04-09 14:35:06 0 248
Andhra Pradesh
నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్ స్వామి
ఈరోజు నందవరం మండలం పులిచింత గ్రామానికి చెందిన నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్...
By Boya Dasthagiri 2026-08-02 16:15:19 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com