ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.

0
96

ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం కీలకమైన ప్రాధాన్యాన్ని అప్పగించింది. ప్రధానమంత్రి మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలకు దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా ఆయనను నియమించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ, ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో విస్తృత ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.

 

 

ప్రజాసేవ, దేశాభివృద్ధి సహా ‘వికసిత్ భారత్–2047’ సంకల్పాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి వినూత్న ప్రజా భాగస్వామ్య సేవలను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాల సమన్వయం, అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి సత్యకుమార్ దగ్గరుండి చూడనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు.
Madanapalle: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం...
By Pagadala Venkateswar 2026-09-18 06:04:46 0 60
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :నారా లోకేష్‌ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు
అన్నమయ్య జిల్లా సోమల మండలం, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు విజయవాడలో నారా...
By Kothuru Murali 2026-02-07 06:43:36 0 188
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: లో విచిత్ర వాతావరణం
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి...
By Kothuru Murali 2026-05-17 17:34:00 0 120
Andhra Pradesh
పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్...
By Kothuru Murali 2026-05-21 18:14:34 0 118
Mizoram
Digital Leap: CM Launches Online Housing & Reservation Systems
Chief Minister Pu Lalduhoma ushered in a new era of governance in Aizawl. Today marks the...
By Dunna Jessicaruth 2026-05-15 11:14:52 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com