కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
Posted 2026-08-29 12:49:41
0
118
మంచిర్యాల నియోజకవర్గం :మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ (గుడిపేట) లోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు,ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి బాధ్యతలను అప్పగించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం, సమాజం పట్ల సేవాభావం పెంపొందించుకోవాలని కలెక్టర్, ఎమ్మెల్యే సూచించారు,విద్యార్థి మండలి ద్వారా పాఠశాలలో విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం, పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, తోటి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు..
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నూతన విద్యార్థి మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు , కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలుగుదేశం పార్టీ బలగం బలం
*మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి*
*తెలుగుదేశం పార్టీ బలం, బలగం...
Gujarat Police Launch Operation Surakshit Cyberspace
The Gujarat Police have launched Operation Surakshit Cyberspace, a critical month-long campaign...
జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో లక్ష్మి అభిజత్య ప్రతిభ
జెఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బొబ్బిలి పట్టణంలోని టీచర్స్ కాలనీకు చెందిన పల్లికల లక్ష్మి అభిజత్య...
Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...