Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.

0
187

కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు.

 

కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయగలిగితేనే, అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు ఖర్చు చేయకపోవడంతో పథకాలు నిర్వీర్యమయ్యాయని, యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలోనూ సమస్యలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

 

ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్‌ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్‌టైల్ పార్కు, తిరుపతిలో స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్, హిందూపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్‌ను ప్రతిపాదించాలని సూచించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద అమరావతిలో సెమీ కండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు చేపట్టాలని, రాజధానిలోని హెల్త్ సిటీలో 'హీల్ ఇన్ ఏపీ' విధానంలో మెడికల్ టూరిజం ప్రాజెక్టులను ప్రోత్సహించాలని తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సద్వినియోగం చేసుకుని, మరిన్ని బస్సులను సాధించాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గ...
By Nookapangu Manikanta 2026-04-10 12:26:52 0 471
Telangana
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించిన కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ 1వ వార్డులో ముమ్మరంగా డ్రైనేజీ శుభ్రత పనులు
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి:  ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ, వార్డు...
By Chunarkar Jagadeesh 2026-09-01 08:45:39 0 261
Telangana
సుల్తానాబాద్ : కాట్నపల్లిలో విషాదం
పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఓ ఇటుక బట్టీలో హృదయ విదారక ఘటన చోటు...
By Sunka Santhosh 2026-04-21 17:41:23 0 251
Telangana
"Falaknuma Parallel ROB Inauguration !!
Hyderabad :   Minister Sri Ponnam Prabhakar  inaugurated the Falaknuma Parallel...
By Sidhu Maroju 2025-10-03 18:52:21 0 474
Andhra Pradesh
మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల జిల్లా పోలీసులు ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారి నేతృత్వంలో కొనసాగిన ప్రత్యేక ఆపరేషన్
మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-10 16:32:04 0 474
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com