బ్యాగులో బంగారం, నగదు, ఆస్తిపత్రాలు.. తిరుమలలో పొగొట్టుకున్న బ్యాగు భక్తులకు తిరిగి అప్పగింత.

0
79

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది మరోసారి తమ నిజాయతీని, సేవాభావాన్ని చాటుకున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో గుంటూరుకు చెందిన ఓ కుటుంబం పోగొట్టుకున్న లక్షల రూపాయల విలువైన నగలు, నగదు ఉన్న బ్యాగును భద్రంగా వారికి అప్పగించి ప్రశంసలు అందుకున్నారు. మానవత్వం, బాధ్యత కలగలిసి ఓ భక్తుల కుటుంబంలో ఆనందం నింపిన ఈ ఘటన తిరుమలలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా బ్రాడీపేటకు చెందిన పోతుల నారాయణ, సునీత దంపతులు తమ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తిరుపతి నుంచి తిరుమల వచ్చే రెండో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా, తమ బ్యాగును ఎక్కడో జారవిడుచుకున్నారు. ఆ బ్యాగులో 61 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,02,840 నగదుతో పాటు సుమారు రూ.10 లక్షల విలువైన భూమి ఒప్పంద పత్రాలు ఉన్నాయి.

 

ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఘాట్ రోడ్డుపై వెళుతున్న ఓ బైకర్ ఆ బ్యాగును గమనించారు. వెంటనే దాన్ని తీసుకుని, ఉదయం 6:30 గంటలకు జీఎన్సీ టోల్‌గేట్ వద్ద విధుల్లో ఉన్న హోంగార్డు రెడ్డప్పరావుకు అప్పగించారు. సమాచారం అందుకున్న టీటీడీ భద్రతా సిబ్బంది ఆ బ్యాగును కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తరలించి భద్రపరిచారు.

 

మరోవైపు, బ్యాగ్ పోయిందని గుర్తించిన భక్తుల కుటుంబం ఆందోళనతో వెతుకుతూ టీటీడీ అధికారులను సంప్రదించింది. వారు చెప్పిన వివరాలు, అందించిన గుర్తింపు ఆధారాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ ఆదేశాల మేరకు, ఏవీఎస్వోలు కృష్ణయ్య, వెంకట శివకుమార్‌ల సమక్షంలో బ్యాగును తెరిపించి, అందులోని వస్తువులను యజమానులతో సరిచూయించారు. నగదు, బంగారం, విలువైన పత్రాలు అన్నీ సురక్షితంగా ఉన్నాయని భక్తులు నిర్ధారించుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు.
మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యుల...
By Pagadala Venkateswar 2026-03-28 14:38:18 0 223
Telangana
పెద్ది కుటుంబానికి పరామర్శించనున్న మాజీ సీఎం...9 10 తేదీల్లో రెండు రోజుల పాటు సుదర్శన్ రెడ్డి సంస్కరణ సభలు..
9న నల్లబెల్లికి కేసీఆర్ పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం భారత్ అవాజ్ న్యూస్ :...
By Gujile Ramu 2026-08-07 01:39:53 0 159
Telangana
ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఇంటిని ముట్టడించిన బీజేపీ నాయకులు
చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో...
By Avunoori Mahesh 2026-04-18 09:48:07 0 193
Telangana
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-05-06 06:22:57 0 371
SURAKSHA
K. Jayaraman: An Officer of Unwavering Integrity
A Shield Against Chaos: The IPS Officer Defining True Service The Guardian of Order In the...
By Kalaga Sailaja 2026-07-17 10:01:22 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com