ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

0
1K

సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. మహంకాళి బోనాలు ఉత్సవాలను ఘనంగా జరపాలని ఆయన కోరారు. అన్ని శాఖల అధికారులతో కలిసి ఆయన ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఇటీవల నెలకొన్న సమస్యలను పండుగ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు లక్షలాదిమంది ప్రజలు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి రానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 29న ఘటాల ఊరేగింపు, వచ్చేనెల 13 14వ తేదీలలో బోనాలు రంగం కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పరిసర ప్రాంతాలలో ఉన్న టాయిలెట్లు సిసి రోడ్లు క్యూ లైన్ లను ఆయన పర్యవేక్షించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. 

Search
Categories
Read More
Telangana
సింగరేణి కార్మికులకు 3,200 కోట్లు దసరా బోనస్ |
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికుల కోసం భారీ దసరా బోనస్‌ను ప్రకటించారు....
By Bhuvaneswari Shanaga 2025-09-23 04:50:39 0 203
Telangana
ఎలీ లిల్లీ కొత్త ఫార్మా హబ్‌కు $1 బిలియన్ |
ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో కొత్త కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్...
By Bhuvaneswari Shanaga 2025-10-06 10:34:36 0 32
Andhra Pradesh
మారిటైమ్ పాలసీ: ఏపీలో నౌకానిర్మాణ కేంద్రానికి కృషి |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు...
By Bhuvaneswari Shanaga 2025-09-26 10:37:51 0 45
Bharat Aawaz
💔 A Mother's Cry Across Borders... Will We Listen?
Kerala - Nimisha Priya, a nurse from Kerala, is facing the death penalty in Yemen.Her only crime?...
By Bharat Aawaz 2025-07-24 09:19:59 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com