Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.

0
464

14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు 

ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల కేటాయింపు

ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్ల కేటాయింపు

రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. 

 

 

 

 

అలాగే, ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ-లాటరీ నిర్వహిస్తారు. మరోవైపు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు భవిష్యత్ అవసరాలు, విస్తరణ కోసం భూ సేకరణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Divya Devarajan IAS: Inspiring Change Through Service
A dynamic Telangana IAS officer celebrated for her compassionate leadership, women-centric...
By Lokeshwari Panthadi 2026-07-15 08:11:27 0 326
Telangana
కూకట్పల్లి ఆర్టీసీ బస్సు డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా కూకట్‌పల్లి డిపోకు 60...
By Jagadeesh Babu 2026-05-27 15:02:04 0 405
Andhra Pradesh
పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...
By Kothuru Murali 2026-01-23 12:54:57 0 199
Andhra Pradesh
ఉయిక శిరీష మృతికి కారణమైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని చింతూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ!
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉయిక శిరీష మృతికి...
By Shyamala Yadagiri 2026-09-01 14:04:07 0 164
Telangana
కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం...
By Mittapelli Saketh 2025-12-23 09:37:21 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com