వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

0
1K

సైబరాబాద్‌(Cyberabad) పరిధిలోని పలు స్టార్‌ హోటళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేశ విదేశాల నుంచి యువతులను అక్రమ రవాణా చేసి, ఆన్‌లైన్‌లో, వాట్సా్‌పలో కస్టమర్లను ఆకర్షించి హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. ఢిల్లీ(Delhi)కి చెందిన ఇద్దరు యువతులతో పాటు, విదేశాలకు చెందిన మరో యువతిని రక్షించి హోమ్‌కు తరలించారు. విటుడిని మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhapur Police Station)కు తరలించారు. పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో ఉంటూ నగరంలో హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న ప్రధాన ఆర్గనైజర్‌ సుమిత్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనికోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం.

కోల్‌కతాకు చెందిన సుమిత్‌ కొన్నేళ్లుగా మెట్రోపాలిటన్‌ నగరాల్లోని స్టార్‌ హోటళ్లను అడ్డాగా చేసుకొని హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దేశ, విదేశాలకు చెందిన యువతులను ఉద్యోగాల పేరుతో నగరానికి రప్పించి ఈ ఊబిలోకి దింపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారికి రోజుకు వేలల్లో డబ్బులు ఇచ్చి మెల్లగా పొడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఆన్‌లైన్‌లో యువతులను ఫొటోలను పెట్టి, విటులను ఆకర్శించి దందాను నిర్వహిస్తున్నారు.

మాదాపూర్‌ పరిధిలోని ఒక హోటల్‌పై దాడి చేసిన సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు. రాజస్థాన్‌(Rajasthan)కు చెందిన ప్రధాన నిందితుడు సుమిత్‌ పశ్చిమబెంగాల్‌లో ఉంటూ, నగరంలో తన అనుచరుల ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా అతిపెద్ద సెక్స్‌ రాకెట్‌ ముఠా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
International
మాదక ద్రవ్యాలపై అమెరికా సైనిక చర్యలు |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
By Bhuvaneswari Shanaga 2025-10-16 10:11:42 0 38
Andhra Pradesh
అల్మట్టి డ్యాం విస్తరణపై ఆందోళన |
అల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అలాగే తెలంగాణ చేపడుతున్న...
By Bhuvaneswari Shanaga 2025-09-24 10:07:11 0 52
Telangana
Remembering P. V. Narasimha Rao on His 104th Birth Anniversary
Born: June 28, 1921 | Known as the "Father of Indian Economic Reforms" Today, India pays tribute...
By Bharat Aawaz 2025-06-28 05:44:41 0 1K
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:49:01 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com