మల్కాజ్‌గిరిలో మువ్వన్నెల జెండా రెపరెపలు.. ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.|

0
171

● 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సందడి

● పలు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణ.. అభివృద్ధి పనులకు శ్రీకారం

● దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపు

మల్కాజ్‌గిరి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు, ప్రధాన కూడళ్లలో జరిగిన వేడుకలకు హాజరై జాతీయ పతాకానికి గౌరవం సమర్పించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం అల్వాల్ మీ సేవా సెంటర్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం, నేరేడ్‌మెట్ చౌరస్తా, మల్కాజ్‌గిరి చౌరస్తా వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. విమలాదేవి నగర్‌లోని వందేమాతరం లైబ్రరీ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్‌లో పతాకావిష్కరణ చేసి, అక్కడ నిర్వహించిన క్యారం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్‌లోని న్యూ శ్రీనగర్ కాలనీలో రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ అదనపు అంతస్తును ప్రారంభించి, అనంతరం అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఓల్డ్ సఫిల్‌గూడలో డీసీఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పాటు, వినాయక్ నగర్ రైల్వే గేట్ సమీపంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.

గౌతమ్ నగర్ డివిజన్‌లోని మల్లికార్జున్ నగర్‌లో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఐ.ఎన్. నగర్‌లో లబ్ధిదారులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

వేడుకల్లో అల్వాల్ మున్సిపల్ ఏఎంసీ హేమలత, మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా, అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, జగదీష్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి, జీకే హనుమంతరావు, తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలు, యువకులు, మహిళలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Sikkim
Enshrinement of Fourth Dodrupchen Rinpoche’s Kudung
Hundreds of monks, devotees, and dignitaries gathered in Gangtok today for the sacred final...
By Dunna Jessicaruth 2026-05-25 10:28:50 0 573
Telangana
డబ్బా కోట్లను తొలగించవద్దు.
చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది....
By Nookapangu Manikanta 2026-05-09 09:39:22 0 186
Andhra Pradesh
రెవిన్యూ అధికారుల అవినీతి – కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా.
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని...
By Pagadala Venkateswar 2026-02-02 07:25:32 0 175
Andhra Pradesh
డిగ్రీ బాలికల గురుకులంలో విద్యార్థి నీ విచక్షణా రహితంగా కోట్టిన వార్డెన్.
భూపాలపల్లి లోని ఎస్సీ బాలికలగురుకులంలో విద్యార్థి నీ తన రూమ్ కి పిలిపించుకొని కర్రతో ఇష్టం...
By Karapati Gopi 2025-12-31 02:08:48 0 791
Telangana
కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తప్పు చేశాడు...మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది  ‎కుట్ర...
By Ponnala Srinivasrao 2026-05-12 01:00:52 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com