Madanapalle: మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా విష్ణునారాయణ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని వెల్లడి.
Madanapalle: మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా విష్ణునారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు పుంగనూరు నియోజకవర్గంలోని సదుం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న విష్ణునారాయణ మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రమోహన్ సదుం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు.
నూతన ఎస్సై విష్ణునారాయణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్‌స్టేషన్ సిబ్బందితో పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై విష్ణునారాయణ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులకు ప్రజలు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz