వాంకిడిలో కాంగ్రెస్ పార్టీ మండల సర్వసభ్య సమావేశం క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కుమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: వాంకిడి మండలంలో సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల కమిటీ ఎన్నిక కోసం ఉద్దేశించిన ఈ సమావేశం, మండల అధ్యక్షుడు గుర్నులే మొంగజీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే 'సంఘటన్ సృజన్ అభియాన్' ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సంస్థాగత పదవుల్లో తగిన ప్రాధాన్యత, గుర్తింపు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.మండల స్థాయి నుండి గ్రామ, బూత్ స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆమె అన్నారు. వాంకిడి మండలంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు నాయకులంతా ఐక్యంగా ముందుకు సాగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలు, బూత్‌ల వారీగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.హాజరైన ముఖ్య నాయకులు:ఈ సమావేశంలో మాజీ మండల అధ్యక్షులు గుర్నులే నారాయణ, ఉపాధ్యక్షులు సెల్వెట్కర్ పెంటు, సామెల రమేష్, కొడప మారుతి, జనరల్ సెక్రటరీ సిండే హనుమంతు, వర్కింగ్ ప్రెసిడెంట్ డీకొండా మహేష్, జాయింట్ సెక్రటరీ కొట్రంగి మేంగాజి పాల్గొన్నారు.వీరితో పాటు పీసీ సెల్ ప్రతినిధులు వాడే పాండురంగ, వడ్లూరి లింగమూర్తి, ఎస్సీ సెల్ ప్రతినిధి చూనార్కర్ శివాజీ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణ, సర్పంచ్ కృష్ణాజీ, ఉప సర్పంచ్ దీపక్ ముండే, దాదాజీ, దన్వర్కర్ కమలేష్, జాడే ప్రభాకర్, ఉప్పురె ధర్ము, కొలె సాధశివ్, కొట్రంగె విజయ్, పందిర్ల గుండయ్య, జాడే సోమ, మండోకర్ మల్లయ్య, సిడం అనిగా, గానా కిషన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz