,ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి పార్టీ అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్,

0
354

 

మండలకేంద్రమైన నందవరం లొని బిజెపి కార్యలయంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిథి గురురాజ్ దేశాయ్ గారితో సమావేసం ఏర్పాటుచేసిన నాబార్డ్ అదికారులు.... 

ఈ నెల 10 వ తారికున ఆంధ్రజ్యోతి 

దినపత్రికలో ప్రచురితమైన

 " స్థలం ఉన్నా మార్కెట్ లేదు " 

అనే శీర్షిక ఆధారంగా నాబార్డు అదికారులు గతంలోనే బిజెపి నాయకులు గురురాజ్ దేశాయ్ గారితో చరవాణిలో మాట్లాడి విషయం తెలుసుకుని ఆయన ఆహ్వనం మేరకు మండలకేంద్రంలోని బిజెపి కార్యలయంలో నాబార్డు అదికారులు సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా నాబార్డు కు సంబందించిన ప్రతినిథి దామోదర రెడ్డిగారు మాట్లాడుచూ పూర్తిగా బిజెపి కేంద్రప్రభుత్వం అధీనంలో పనిచేస్తున్న నాబర్డ్ సంస్థ మార్కెట్ నిర్మాణానికి 15 లక్షలు నిదులు కేటాయిస్తుందని, గ్రామపంచాయతి ఒకలక్ష డెబ్భై వేలరూపాయలు భరించవలసి వస్తుందని అలాగే కనీసం 20 సెంట్ల స్థలం కూడా గ్రామపంచాయతి ఇవ్వవలసివస్తుందని తెలిపారు.

ఈ మర్కెట్ ను నాబార్డు సంస్థ కట్టించి అందులొ ఒకచిన్న కార్యాలయాన్ని మరియు ప్రజలకు వాష్రూమ్ లను కూడ ఏర్పాటుచేసి గ్రామపంచాయతికు అలాట్మెంట్ చేస్తుందని వివరించారు.

అలాగే దేశంలొ అన్నిరాష్ట్రాలలో గ్రామాల అభివృద్ది పనులకు నాబార్డు సంస్థ ద్వారా పూర్తిగా నూరుశాతం బిజెపి కేంద్రప్రభుత్వం నిదులను ఇస్తుందని రాష్ట్రప్రభుత్వాలు ఈ కార్యక్రమాలకు నాబార్డుకు నిధులు కేటాయించడంలో భాగస్వామ్యం వహించవని తెలియచేశారు.

అనంతరం గురురాజ్ దేశాయ్ గారు స్థానిక ఎంపీడీఓ గారితొ చరవాణిలో మాట్లాడి గ్రామపంచాయతి ఆవరణంలో 20 సెంట్ల స్థలాన్ని మార్కెట్ కోసం కేటాయించాలని కోరారు, అందుకు ఎంపీడీఓ గారు సానుకూలంగా స్పందించి నాబార్డు అధికారులసమక్షంలో కొలతలు కూడా తీసుకొవడం జరిగింది. 

ఈ మార్కెట్ నిర్మాణానికి నిదులు విడుదల చెయ్యడానికి జిల్లా నాబార్డ్ అదికారులు ముంబయిలోని నాబార్డు కేంద్రకార్యాలయానికి త్వరలొనే ప్రతిపాదనలు పంపుతామని అలాగే నిదులు విడుదల కావడానికి కనీసం రెండు నెలలు సమయం పట్టవచ్చని దామోదర రెడ్డి తెలియచేశారు.

మార్కెట్ నిర్మాణం జరిగిన తరువాత మార్కెట్ ఎలావుంటుందనే నమూనాలు కూడా ఇవ్వడం జరిగింది. 

ఈ సందర్బంగా గురురాజ్ దేశాయ్ గారు మాట్లాడుచూ కేవలం నందవరంలొనే కాకుండగా నాగాలదిన్నె, హలహర్వి మరియు మిగతా మేజర్ గ్రామపంచాయితీ పరిధిలో కూడా నాబార్డు సంస్థ తరపున స్థానిక మర్కెట్ కొరకు నిదులు కేటాయించాలని అందుకు కేంద్ర బిజెపి నాయకులతొ కూడా మాట్లాడి వారి సహాయంకూడా తీసుకుని మండలంలో నాబార్డ్ సహాయంతో గ్రామ అభివృద్ది పనులు చెయ్యడానికి కృషిచేస్తానని తెలిపారు.

అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా నాబార్డు అదికారులు, బిజెపి నాయకులు మరియు వివిద గ్రామాల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని నిన్న రాత్రి పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...
By Kalaga Sailaja 2026-06-27 06:08:33 0 93
Telangana
ఆసిఫాబాద్‌కు ఏం చేశారో చూపించండి. అధికార పక్షానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి బహిరంగ సవాల్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్  ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మూడేళ్లుగా కేవలం...
By Chunarkar Jagadeesh 2026-08-19 02:46:20 0 241
SURAKSHA
The Dynamic Administrator: Shri Vikram Singh Malik
Driving Efficient Governance and Administrative Precision from Ground to Capital Excellence in...
By Kalaga Sailaja 2026-08-01 13:42:17 0 246
SURAKSHA
C.H. Nagaraju IPS: A Leader Shaping Modern Policing
The Journey Begins "The true strength of policing lies not only in enforcing...
By Fathima Safa 2026-07-14 05:57:39 0 174
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా యోగి వేమన జయంతి సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఘన నివాళి
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-19 11:44:52 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com