మండలం మల్లంపేటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..!

0
141

మల్లంపేట: ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన మల్లంపేటలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

‎కేవలం 150 చదరపు గజాల స్థలాల్లోనే ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించకుండా జీ+3 భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా, కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

‎ముఖ్యంగా ఇరుకైన గల్లీల్లోనూ ఎలాంటి అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించడంతో భవిష్యత్తులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల ద్వారా కొందరు బిల్డర్లు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

‎ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఓ మహిళ ఆవేదన .
తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే...
By Mobbu Venkatramana 2026-02-23 15:04:22 0 301
Dadra &Nager Haveli, Daman &Diu
Administrative Hearings: Legal Procedures in Daman
The Deputy Collector’s office in the Union Territory of Dadra & Nagar Haveli and Daman...
By Lokeshwari Panthadi 2026-06-27 10:22:10 0 167
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో భారీగా బిజెపిలో చేరికలు.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని కొల్తూరు గ్రామంలో రాజకీయ...
By Sidhu Maroju 2026-01-31 09:02:14 0 218
Andhra Pradesh
వినాయక చవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు వినాయక చవితి  ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో...
By Vinod Kumar 2026-09-11 12:06:43 0 205
Andhra Pradesh
అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా...
By Vadlamudi NagaVenkat 2026-06-01 09:40:23 0 362
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com