మండలం మల్లంపేటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..!

0
142

మల్లంపేట: ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన మల్లంపేటలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

‎కేవలం 150 చదరపు గజాల స్థలాల్లోనే ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించకుండా జీ+3 భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా, కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

‎ముఖ్యంగా ఇరుకైన గల్లీల్లోనూ ఎలాంటి అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించడంతో భవిష్యత్తులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల ద్వారా కొందరు బిల్డర్లు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

‎ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Advances Renewable Energy Growth in 2026
Maharashtra continues to expand its renewable energy capacity through large-scale solar, wind,...
By Fathima Safa 2026-07-06 08:23:27 0 161
Telangana
పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్..!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్‌...
By Ponnala Srinivasrao 2026-05-13 00:11:18 0 147
Andhra Pradesh
Vijayasai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి ఈడీ విచారణ.
ఏపీ మద్యం స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి ఈడీ విచారణ హైదరాబాద్‌లో దాదాపు 7 గంటల పాటు సాగిన...
By Pagadala Venkateswar 2026-01-22 15:02:17 0 196
Chandigarh
Global Experts Debate AI Safety at Chandigarh University
The Apex Institute of Technology at Chandigarh University recently concluded its milestone...
By Lokeshwari Panthadi 2026-06-25 11:24:51 0 97
Andhra Pradesh
రోడ్డుపక్కన పిచ్చి మొక్కలు తొలగింపు
పాచిపెంట నుంచి పి.కొనవలస చెక్ పోస్టు కూడలి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను పాచిపెంట...
By Boiena Rajesh 2026-08-31 11:20:42 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com