బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్.|

0
138

● మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు

● ప్రజల ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం అమ్మవారిని ప్రార్థించిన ఎమ్మెల్యే

మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 5: భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో వెలసిన శ్రీ దుర్గా ఎల్లమ్మ దేవస్థానంలో మహంకాళి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సుభిక్షంతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రతి ఏడాది భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ బోనాల వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని యూనియన్ అధ్యక్షుడు శ్యామ్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజీవ్ రెడ్డి
 ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు🙏🙏,,,,,...
By Boya Dasthagiri 2026-03-27 05:16:33 0 330
Andhra Pradesh
అమరజీవి జలదార శంకుస్థాపన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Breaking points :   తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన...
By Rajini Kumari 2025-12-20 12:33:27 0 215
Telangana
ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల...
By Pindikura Mahesh 2026-05-01 03:37:31 0 470
Andhra Pradesh
మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్...
By Pagadala Venkateswar 2026-04-18 03:51:05 0 132
Telangana
జూలై 1న జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన కార్యక్రమాలు
గోదావరిఖని : కోల్ ఇండియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా సమావేశమై...
By Avunoori Mahesh 2026-06-23 15:28:37 0 275
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com