జనసేవకుడు పెద్దపురం నరసింహకు డాక్టరేట్ పురస్కారం.

2
1K

గత 15 సంవత్సరాలుగా పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వాళ్ల వరకు నిరంతరం సేవ చేస్తూ.. ముందు వరసలో ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానుర్ వాసిపెద్దపురం నరసింహ కు మ్యాజిక్ అండ్ ఆర్ట్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. సమాజంలో ప్రజల కోసం సేవ చేస్తున్న వారిని గుర్తించి అవార్డులు ఇస్తామని యూనివర్సిటీ ప్రకటించింది. పెద్దపురం నరసింహ తమ గ్రామంలో కష్టం ఉన్న వాళ్లకు నేనున్నానని ధైర్యం చెప్పి ముందు వరుసలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సేవా దృక్పది అని గుర్తించారు. గ్రామంలో తన బాధ్యతగా ప్రభుత్వ పెన్షన్లు రాని పేద వృద్ధులకు నెలనెల పెన్షన్లు తన సొంత డబ్బులు ఇస్తూ తమకు అండగా తన సేవా దృక్పథాన్ని చూపించారు, గ్రామంలో పేదలు ఎవరైనా చనిపోతే పదివేల రూపాయలు అంత్యక్రియలకు ఖర్చు తాను ఎక్కడున్నా ఆ కుటుంబానికి చేర్చడంలో కుటుంబానికి పెద్దదిక్కుగా మారుతున్నారు. గ్రామంలో పేద ఆడపడుచుల పెళ్లిళ్లకు పుస్తే మట్టే లతో పాటు తన ఫంక్షన్ హాల్ ఉచితంగా ఒక్క రూపాయి చార్జి తీసుకోకుండా ఇవ్వడంలో తనకు తానే సాటి అని నిరూపించారు. ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని లక్ష్యంతో సొంత నిధులతో పిల్లలకు వృద్ధులకు మహిళలకు యువకులకు అనేక సేవా కార్యక్రమంలో ముందు వరసలో ఉంటూ గ్రామస్తుచే శభాష్ అనిపించుకున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు ఫీజులు చెల్లిస్తూ పిల్లల బంగారు భవిష్యత్తుకు తాను బాటలు వేస్తున్నారు. నిరుపేదలు ఇల్లు కడితే దానికి సంబంధించిన ఫర్నిచర్, ఇటుక సిమెంట్ వంటివి ఇప్పించడంలో తోడ్పడుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తనకు ఉన్న దాంట్లో పది రూపాయలు పేదలకు ఇవ్వాలని నిత్యం తాను నమ్మిన సిద్ధాంతాన్ని పలువురికి చెబుతూ ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా సమయంలో చార్జీలకు బీహార్ చత్తీస్గడ్ హర్యానా రాజస్థాన్ కూలీలకు తాను ఉండడానికి షెల్టర్ సదుపాయం ఏర్పాటు చేసి వారికి భోజనం ఏర్పాట్లు చూసి కరోనా సమయంలో వారి కి అండగా ఉన్నారు. వివిధ రాష్ట్రాల వారిని తన సొంత డబ్బులతో వెహికల్స్ ను అరేంజ్ చేసి తమ ప్రాంతాలకు పంపించి మానవత్వాన్ని చూపించారు. పలు రంగాల్లో తాను ఎదగడంతోపాటు నలుగురికి సాయం చేస్తూ నలుగురిని తన బాటలో నడిపించడంలో సక్సెస్ అయ్యారు. జర్నలిస్టుగా పినాకిని మీడియా అందించిన ఉత్తమ జర్నలిస్టు 2025 అవార్డు రవీంద్రభారతిలో అందుకొన్నారు. భారత్ జయహో చైర్మన్ గా పలు కథనాల ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడిగా జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తునే జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చినా తాను అండగా నిలిచారు. శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ లాంటి దేశాలకు జర్నలిస్టుల కోసం యూనియన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలిపారు. సినిమా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా సినిమా రంగ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేశారు ఇవన్నీ చేస్తూనే సమాజంలో జరుగుతున్న చెడును తనకున్న రంగాల నుండి దూరం చేయాలన్న తపనతో పనిచేస్తున్న పెద్దపురం నరసింహ ను డాక్టరేట్ వరించడంతో పలువురు హర్షిస్తున్నారు. ఈ అవార్డుతో తన బాధ్యతను మరింత పెంచిందంటూ తన సేవలను మరింత విస్తృతంగా చేసేందుకు తన మిత్రులు, శ్రేయోభిలాషులు తనకు తోడుగా ఉండాలని అవార్డు లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

Love
1
Search
Categories
Read More
Telangana
మా సమస్యలను పరిష్కరించండి: అల్వాల్ జొన్నబండ నివాసులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2025-06-29 12:42:09 0 1K
Maharashtra
Bombay High Court: Speed Up Sony–Tata Play Case!
The Bombay High Court has asked the telecom tribunal (TDSAT) to quickly resolve the dispute...
By Bharat Aawaz 2025-06-25 12:54:58 0 1K
Andhra Pradesh
వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్
మార్కాపురం టౌన్ నందు బి కన్వెన్షన్ హాల్ నందు వైసిపి విస్తృత స్థాయి సమావేశం విజయవంతంలో ప్రకాశం...
By mahaboob basha 2025-07-12 15:11:45 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com