గ్రీవెన్స్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

0
435

మహబూబాబాద్ జిల్లా: జనవరి 5(భారత్ అవాజ్):జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తం ( 72 ) దరఖాస్తులు వచ్చాయని అందులో అందులో రెవిన్యూ శాఖ 35, మున్సిపాలిటీ 13, పంచాయతీ రాజ్ శాఖ 05, జిల్లా అభివృద్ధి సంస్థ 05, గృహ నిర్మాణ శాఖ 03, గిరిజన సంక్షేమ శాఖ 02 చొప్పున వివిధ శాఖలకు దరఖాస్తులు వచ్చాయి.

 మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన పర్వతపోజు సుమలత తాను క్రాఫ్ట్ కోర్సు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నానని తనకు కంబాలపల్లి పాటశాలలో ఖాళీగా ఉన్న క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

మహబూబాబాద్ పట్టణంలోని జగ్జీవన్ రాం నగర్ కాలనీ కి చెందిన అనంతుల కళ్యాణి మొదటి జాబితాలో తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినదని అట్టి మంజూరు అయినటువంటి ఇందిరమ్మ ఇల్లు ను ఇప్పించాలని కోరారు.

సీరోలు మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన బానోత్ ప్రవీణ్ తనకు గత సంవత్సరం గిఫ్ట్ డీడ్ క్రింద భూమి రిజిస్ట్రేషన్ అయిందని అట్టి భూమి యొక్క పాసు పుస్తకాలని ఇప్పించాలని కోరారు.

గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన కోడి స్రావంతి తనకు వికలాంగుల సర్టిఫికేట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు వికలాంగుల పెన్షన్ పొందట్లేదని అట్టి వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, ఏడి ఎస్ఎల్ఆర్ నరసింహ మూర్తి, జిల్లా ఉద్యానవన అధికారి జి. మరియన్నా, డిపిఓ హరిప్రసాద్, ఎస్సీ,బిసి, ఎస్టీ, మైనార్టీ అధికారులు శ్రీనివాస్, దేశీ రామ్ నాయక్, పరిశ్రమల అధికారి శ్రీమన్నారాయణ, సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ కృష్ణవేణి, సిపిఓ శ్రీనివాస్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్మనాయక్, వెల్ఫేర్ అధికారిని సబిత, సివిల్ సప్లై అధికారి రమేష్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రజిత, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, పర్యవేక్షకులు మదన్ గోపాల్, రాజేష్, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పూర్ణపాడులో ఏనుగులు
పూర్ణపాడు గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారం ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా...
By Boiena Rajesh 2026-08-27 13:23:56 0 110
Bharat Aawaz
📣 భారత్ అకాడమీ నుండి బిగ్ అనౌన్స్‌మెంట్! 📣
రేపటి సమాజాన్ని ప్రభావితం చేసే గొంతుకగా మారాలనుకుంటున్నారా? మీ నిరీక్షణకు సమయం ఆసన్నమైంది! 🎤...
By Pulse 2026-04-11 04:55:54 0 1K
Andhra Pradesh
YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.
రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి! ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-02-23 10:16:07 0 196
Andhra Pradesh
నారా లోకేష్ పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి మండిపల్లి ఆఫీస్ ఐ టి డి పి సభ్యులు సంబరాలు
ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ఆదేశానుసారం నారా లోకేష్ బాబు...
By Benguluri Madhubabu 2026-01-27 08:02:38 0 277
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల...
By Pagadala Venkateswar 2026-06-24 04:32:34 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com