Madanapalle: అన్నమయ్య జిల్లా చేనేత కార్మికులందరికీ 'నేతన్న సేవ' వర్తింపజేసి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌కు జాతీయ చేనేత ఐక్య వేదిక వినతి.

0
144

అన్నమయ్య జిల్లాలోని చేనేత కార్మికులందరికీ ‘నేతన్న సేవ’ పథకం వర్తింపజేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జాతీయ చేనేత ఐక్య వేదిక జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. సంఘం జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీలం వెంకటేశ్వర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోడెం నాగరాజు ఆధ్వర్యంలో సమర్పించిన వినతిపత్రంలో, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లి, పీలేరు, రాయచోటి, పుంగనూరు ప్రాంతాల్లో సుమారు 20 వేల చేనేత, అనుబంధ వృత్తుల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘నేతన్న నేస్తం’ పథకం కింద సుమారు 7 వేల మందికి పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి విడుదల చేసిన జాబితాలో 2,805 మంది పేర్లు తొలగించబడడంతో అనేక మంది చేనేత కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాడుగ ఇళ్లలో సొంత మగ్గాలతో పనిచేసే కార్మికులు, ఒకే ఇంట్లో పలువురు కలిసి మగ్గాలు నిర్వహించే వారు, ఇంటి యజమాని పేరుపై విద్యుత్ మీటర్ ఉండటం వంటి కారణాలతో అర్హత కోల్పోతున్నారని తెలిపారు. ఈ అంశాలపై చేనేత జౌళి శాఖతో సమగ్ర విచారణ నిర్వహించి, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ‘నేతన్న సేవ’ పథకం కింద రూ.25 వేల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య నుంచి 2.58 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
✒️- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58...
By Rajini Kumari 2026-01-11 11:24:25 0 221
Andhra Pradesh
అంగరంగ వైభవంగా జరిగిన గొల్లపూడి అయ్యప్ప స్వామి వేడుకలు
విజయవాడ గొల్లపూడి అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా గొల్లపూడి వాసులు అంగరంగ వైభవంగా కోలాటాల...
By Rajini Kumari 2025-12-27 14:57:30 0 260
Telangana
నిజామాబాద్
అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ ప్రాంతాలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య పరిష్కారం. అశోక్...
By Sadaq Sadaq 2026-06-09 09:25:39 0 161
Goa
Cashew Yield in South Goa Halves as Weather Patterns Disrupt Crop Cycle
South Goa’s cashew production has dropped by approximately 50%, driven by unfavorable...
By Bharat Aawaz 2025-07-17 06:26:34 0 1K
Andhra Pradesh
మెప్మా ఉద్యోగులు ధర్నా
విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న...
By Mobbu Venkatramana 2026-03-16 09:12:35 0 551
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com