బాబాపూర్ గ్రామానికి విచ్చేసిన ఆసిఫాబాద్ నూతన సీఐ నీలం రవి గారికి గ్రామస్తుల ఘన స్వాగతం

0
377

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆగస్టు 01:  ఆసిఫాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నీలం రవి గారు బాబాపూర్ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ సత్రవేణి. రాజన్న గారి ఆధ్వర్యంలో వార్డు ప్రతినిధులు, యువత నూతన సీఐకి పుష్పగుచ్ఛాలు అందించి మర్యాదపూర్వకంగా గ్రామంలోనికి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో స్థానిక నేతలు సీఐని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ నీలం రవి గారు మాట్లాడుతూ ఆసిఫాబాద్ టౌన్ సర్కిల్  పరిధితో పాటు బాబాపూర్ మరియు దాని పరిసర గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం పెంపొందించడానికి, నేరాల నియంత్రణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎల్లవేళలా పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పోలీసు శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దశరథ్, సాయి, వెంకటి, గ్రామ పెద్దలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security Port Blair...
By BMA ADMIN 2025-05-22 12:48:14 0 2K
Telangana
అంబేద్కర్ వారసులమా? అరాచకవాదులమా? - ఎమ్మెల్యేపై బీజేపీ ఫైర్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మండుల సామెల్ హిందూ ధర్మం మరియు...
By Sidhu Maroju 2026-03-18 14:58:03 0 234
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:44 0 83
Andhra Pradesh
విశాఖ లో లోకా యుక్త శిబిరం
ఈ నెల 29.30 తే ది ల లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖలో   నిర్వ హి స్థూన్నా మ నీ  లో కా...
By Mobbu Venkatramana 2026-01-18 14:57:08 0 690
Andhra Pradesh
టీడీపీ కార్యకర్త జయచంద్రకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతి.
మదనపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త కందికట్ల జయచంద్రకు పార్టీ పట్ల అంకితభావం, కష్టపడే తత్వం...
By Pagadala Venkateswar 2026-03-30 06:39:15 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com