దశాబ్దాల భూ సమస్య.. ఈటల రాజేందర్‌ను ఆశ్రయించిన బాధితులు.|
● అన్మత్ నగర్, హయత్ నగర్ భూ సమస్యలపై ఎంపీని కలిసిన బాధితులు
● 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లేవని ఆవేదన
● సమస్యను పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తానని ఈటల భరోసా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఆగస్టు 1: అన్మత్ నగర్, హయత్ నగర్ ప్రాంతాలకు చెందిన భూ బాధితులు శనివారం శామీర్‌పేటలోని ఎంపీ ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, సుమారు 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేద దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఎకరం చొప్పున భూమి కేటాయించారని తెలిపారు.
ప్రస్తుతం ఆ భూముల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వడం లేదని, పలువురు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఇళ్లలో పనిచేసుకుంటూ, పారిశుధ్య పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని, కనీసం నివాసం కోసం కొంత స్థలం కల్పించాలని కోరారు. కుటుంబ సభ్యులు మృతి చెందిన సమయంలో కూడా అంత్యక్రియలకు, ఇంటి ముందు స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోయారు.
బాధితుల సమస్యలను విన్న ఎంపీ,ఈటల రాజేందర్, విషయాన్ని పరిశీలించి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
#Sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz