దూరం దూరమైంది... రేషన్ చేరువైంది.|

0
144

● రాజీవ్ గాంధీ నగర్‌లో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

● స్థానికుల విజ్ఞప్తికి సానుకూల స్పందనతో అందుబాటులోకి సేవలు

● వృద్ధులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు ఇకపై సౌలభ్యం

మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని, ఆల్వాల్.. వెంకటాపురం డివిజన్, కానాజీగూడ రాజీవ్ గాంధీ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాన్ని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానికులు ఎన్నో ఏళ్లుగా తమ ప్రాంతంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని అన్నారు. 

ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర సరఫరాల శాఖ అధికారులతో సమన్వయం ఫలితంగానే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. 

ఇకపై తమ ప్రాంతంలోనే నిత్యావసర సరుకులు పొందే అవకాశం కలగడంతో లబ్ధిదారుల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని వివరించారు.

కొత్త చౌక ధరల దుకాణం అందుబాటులోకి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో..మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, రేషన్ డీలర్ సంజీవరావు, బీఆర్ఎస్ నాయకులు, శ్రీధర్ గౌడ్, డోలి రమేష్, సయ్యద్ మోసిన్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ప్రవేశ పరీక్షలో 78 విద్యార్థులు ఎంపిక: ప్రిన్సిపల్
పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు...
By Kothuru Murali 2026-04-23 15:14:44 0 150
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీ కి ట్రిపుల్ఐటీ బాసరలో సీటు.....!
మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీకి ట్రిపుల్ఎటీ బాసరలో సీటు.   భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-06-01 15:00:03 0 216
Telangana
గణనాథులను దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్...
By Sidhu Maroju 2025-09-01 13:36:51 0 460
Andhra Pradesh
Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆన్‌లైన్ దర్శనం ప్రారంభం.. సేవలను ఇలా బుక్ చేసుకోవాలిKanaka Durga Temple:కనక దుర్గ ఆలయ యాజమాన్యం ఈ వ్యవస్థను తిరుమల తిరుపతి దేవస్థానాల విజయవంతమైన ఆన్‌లైన్ సేవల నమూనాలో రూపొందించింది.
Kanaka Durga Temple: ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గ ఆలయంగా...
By Siva Bhaskar 2025-12-25 03:24:54 0 716
Telangana
కనాజిగూడలో కొత్త విద్యుత్ పోల్స్.|
"రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు.. స్థానికుల్లో హర్షం"...
By Sidhu Maroju 2026-07-13 09:35:55 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com