నిండుమనసుతో హాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటా: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

0
1K

డివిజన్ ఎం.ఎన్.రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో హ్యాట్రిక్ విజయంతో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన కెపి.వివేకానంద్ గారిని సన్మానిస్తూ "సన్మాన సభ" ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారిని కార్యక్రమ నిర్వాహకులు గజమాలతో సత్కరించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారు మాట్లాడుతూ....గత రెండు పర్యాయాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమాన్ని చూసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో భాగంగా కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పునః నిర్మాణ పనులకు ముందుకు వచ్చి తమ తోడ్పాటునందిస్తున్న దాతలను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కరింపచేశారు.ఈ కార్యక్రమంలో ఎం. ఎన్. రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు టెంపుల్ కమిటీ చైర్మన్ ఎస్. గోవర్ధన్ రెడ్డి, కాలనీ ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి భరత్, దేవాలయ ప్రధాన కార్యదర్శి శివరాం రెడ్డి, కోశాధికారి రాము, కాలనీవాసులు లక్ష్మీ మోహన్, మోహన్ రావు, సంజీవరావు, చంద్రారెడ్డి, హరికృష్ణ, కిరణ్ కుమార్, బాల శ్రీనివాసమూర్తి, చంద్రశేఖర్, నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, గుమ్మడి మధుసూదన్ రాజు, కాలే నాగేష్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత, సంపత్ గౌడ్, బాల మల్లేష్, ఆటో బలరాం, విజయ్ హరీష్, మహిళా నాయకురాలు ఇంద్రా రెడ్డి, శ్రీదేవి రెడ్డి, కల్పన తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్ కు చెందిన పూజిత కు అనంతపురం...
By mahaboob basha 2025-09-09 05:51:18 0 229
Telangana
జాగ్రత్త సుమా కుక్క కాటుతో వచ్చే రెబిస్ వ్యాధి ని నయం చేయలేరు
రేబిస్‌ను నయం చేయలేము. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేబిస్ మరణాలలో భారతదేశం 36% వాటా కలిగి ఉంది....
By Vadla Egonda 2025-07-05 01:27:40 0 1K
Andhra Pradesh
మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కార్యక్రమాలకు ఇవ్వకూడదని క్రీడాకారుల నిరసన
ప్రచురణార్థం 14/12/25 సింగ్ నగర్    మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు...
By Rajini Kumari 2025-12-15 08:04:44 0 55
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com