ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

0
1K

 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటారు కానీ ఐఏఎస్ గా, ఐపీఎస్ గా ఉన్న, నాయకుడుగా ఏ పార్టీలో ఉన్న, జడ్జిగా ఉన్న....అభిప్రాయాలను ఒక పౌరునిఘా తెలియజేయవచ్చని నరహరి గారు నిరూపించారు.

ఇలాంటి వేదికలు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా జరుగుతున్నాయి. కుల సంఘాలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీగానే సాగుతున్నాయి. అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఒక వేదిక మీదకు రావడం, మాట్లాడుతున్నప్పుడు దాన్ని భరించడం...ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే తపన కలిగి ఉండటం సంతోషాన్ని కలిగిస్తుంది.మహేష్ కుమార్ గౌడ్ గారు వారి పార్టీ, వారి సిద్ధాంతంగురించిచెప్పుకున్నారు.

దాసోజు శ్రవణ్ గారు వారి ఆలోచనలను పంచుకున్నారు.రాజకీయాలలో కూడా కొన్ని మూల సూత్రాలు ఉంటాయి. అడుక్కుంటే వచ్చేది కాయో, పండు కానీ పోరాడితే మాత్రం వచ్చేది హక్కులు. అణిచివేతకు గురైన వారు మాత్రమే హక్కులు కోరుతారు, సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. వారే పుస్తకాలు రాస్తారు, ఉద్యమాలు చేస్తారు, సంఘాలు పెట్టుకుంటారు. రాజ్యం, రాజ్యాంగం ఎవరి చేతిలో ఉందనే దానిమీద ఆధారపడే రేపటి ఫలితాలు ఉంటాయని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు.ఇంజనీరింగ్, ఐఏఎస్, డాక్టర్ ఏది కావాలన్నా మెరిట్ కావాలి కానీ రాజకీయ నాయకులకు కూడా మెరిట్ కావాలని నేను అంటున్నాను.ఆ మెరిట్ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల జీవితాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన మెరిట్ కావాలి. రాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా అర్థం చేసుకునే మెరిట్ కావాలి. రాజ్యం, రాజ్యాంగం ఎవరికోసం పనిచేయాలో... ఎలా అమలు చేయాలి తెలిసే మెరిట్ కావాలి."The Toughest Job in Globe is Politics" అంటున్నారు. ఒకప్పుడు విద్యార్థులు కూడా సంఘాలు ఉండేవి కానీ ఇవాల్టి విద్యార్థులకు కంప్యూటర్ మైకంలోకి వెళ్తున్నారు. సామాజిక స్పృహ తగ్గిపోతుంది. సంకీర్ణ రాజకీయాలు ఉన్నటువంటి ఈ కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో 27 మంది ఓబీసీలను మంత్రులను చేసిన ఘనత మోడీ గారిది. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో చదువుకున్నాను. ఆ రోజుల్లో అన్నం కొలిచి పెట్టినప్పుడు, పురుగులు వస్తున్నప్పుడు, ఉడికి ఉడకని అన్నం తింటున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత మొదటి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎదుగుతున్న పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలి. అది కూడా సన్న బియ్యం అన్నమే పెట్టాలి అని జీవో తీసుకొచ్చాను.నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జాజుల శ్రీనివాస్ గారు వచ్చి దరఖాస్తు ఇచ్చేవారు. నేను ఇక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నాను, హాస్టల్ నుంచి వచ్చినోడినే కదా ఇంకా నీలాంటి వాడు దరఖాస్తు ఇచ్చి, దండం పెట్టాల్సిన అవసరం లేదు... దీనికి అద్భుతమైన ప్రణాళిక రూపొందిస్తున్న అని చెప్పాను. ఏ వర్గాలు అయితే అసెంబ్లీ మెట్లు ఎక్కలేదు అలాంటి 70 కులాలతో 40 రోజులు పాటు నేను స్వయంగా మీటింగ్ పెట్టుకున్నాను. ఆనాడు స్పీకర్, చైర్మన్ ఓబీసీలే. బీసీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో మూడు రోజులపాటు ఓబీసీ కాంక్లేవ్ అనే మీటింగ్ ఏర్పాటు చేశాము. అక్కడ శ్రీకారం చుట్టిందే 250 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్. కులాల పరంగా కూడా ఆత్మగౌరవ భవనాలకు పునాది పడింది కూడా అక్కడే. ఈ పుస్తకాన్ని రచించిన నరహరి గారికి వారి మిత్రులు పృథ్వీరాజ్ సింగ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.

Search
Categories
Read More
Telangana
లిక్కర్ లైసెన్సుల దరఖాస్తుల్లో తగ్గుదల |
తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు 2025 అక్టోబర్ 23 నాటికి మద్యం దుకాణాల లైసెన్సుల కోసం 95,500...
By Akhil Midde 2025-10-24 04:54:29 0 45
Andhra Pradesh
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం ప్రత్యేక ఉత్సవం |
తిరుమలలో తొమ్మిది రోజుల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజున ఆంధ్రప్రదేశ్ సీఎం న. చంద్ర‌బాబు...
By Bhuvaneswari Shanaga 2025-09-25 07:47:00 0 97
Dadra &Nager Haveli, Daman &Diu
Union Minister Ramdas Athawale Demands Statehood for Dadra and Nagar Haveli & Daman and Diu
Union Minister Ramdas Athawale Demands Statehood for Dadra and Nagar Haveli & Daman and Diu...
By BMA ADMIN 2025-05-23 06:40:13 0 2K
Telangana
డీసీపీపై దాడి.. అన్సారి ఆరోగ్యం విషమం |
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కాల్పుల కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిన్న డీసీపీపై...
By Akhil Midde 2025-10-27 06:03:46 0 45
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com