రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు

0
1K

కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి టిజీ భరత్ గారితో కలిసి కర్నూలు ఎం.పీ బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు.. ఈ సందర్బంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రూసా నిధులతో అదనపు తరగతుల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ స్థలాలను చూపించి వాటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసే చర్యలు తీసుకోవాలని కోరామని తెలియజేశారు. ఉస్మానియా కాలేజీ తో తనకు చాలా అనుబంధం ఉందని 1994- 96 సంవత్సరాల లో ఎంఎస్సీ, బీఈడీ పరీక్షలు ఈ కళాశాలలోనే రాయడం జరిగిందని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ ఎస్ ముజామిల్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీమతి ఆజ్రా జావేద్, రూస ఇంచార్జ్ డాక్టర్ ఎస్. గజని కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్ దీపావళి సందర్భంగా రైలు...
By Bharat Aawaz 2025-10-14 11:25:10 0 61
Telangana
ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన...
By Sidhu Maroju 2025-07-11 18:05:18 0 2K
Business
Asian Stocks Stumble on US Shutdown Fears, Kospi Bucks Trend |
Asian markets closed Friday with a mixed bag of results, largely leaning into the red as global...
By Meghana Kallam 2025-10-11 05:19:56 0 68
Sports
సిడ్నీ వన్డేలో భారత్‌ ఘన విజయం, రోహిత్‌ సెంచరీ |
సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఆసీస్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం...
By Akhil Midde 2025-10-25 10:40:44 0 60
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com