గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

0
260

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలను ఉపాధ్యాయుల నుండి అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును సమీక్షించిన ఎమ్మెల్యే, విద్యార్థులకు నాణ్యమైన భోజనం నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎయిడెడ్ పాఠశాలలకు తగిన నిధులు కేటాయించాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని పాఠశాలల్లో పెచ్చులు ఊడి పడుతున్నాయని, మరుగుదొడ్ల కొరత ఉందని, తక్షణమే మరమ్మత్తులు చేపట్టాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా పట్టాభిపురం హై స్కూల్ వద్ద గంజాయి బ్యాచ్ అధికంగా ఉండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరగా, గంజాయి బ్యాచ్‌ను ఉపేక్షించవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను చరవాణిలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశించారు.

ఉపాధ్యాయులు తన దృష్టికి తీసుకొచ్చిన అన్ని అంశాలను పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, సమస్యలకు త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని, ఆయన స్ఫూర్తితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పాఠశాలలన్నింటిలో సమస్యలను పరిష్కరించి, మెరుగైన వసతులు కల్పించి, విద్యార్థులకు ఉత్తమ విద్య అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే గణనీయమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హరిప్రసాద్ నగర్‌లో వైభవంగా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు - 63 ఏళ్లుగా కృష్ణబలిజ సంఘీయుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంప్రదాయం
చీరాల చీరాల పట్టణంలోని 29వ వార్డు హరిప్రసాద్ నగర్‌లో శ్రీమద్విరాట్ పోతులూరి...
By Vadlamudi NagaVenkat 2026-04-28 09:06:35 0 273
Telangana
సీవరేజ్ పనులు వేగవంతం చేయాలి.|
- లక్ష్మీనగర్‌లో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి - గడువులోగా...
By Sidhu Maroju 2026-07-19 07:26:57 0 128
Andhra Pradesh
తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు.
  తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు 03-05-2026 Sun 19:24 | Both States...
By Pagadala Venkateswar 2026-05-04 06:17:45 0 145
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆల్వాల్‌లో HPV వ్యాక్సిన్ ప్రారంభం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య...
By Sidhu Maroju 2026-03-30 09:53:14 0 184
Andhra Pradesh
Construction of New Assembly Building in Amaravati Begins
The construction of the Andhra Pradesh Legislative Assembly building in Amaravati has officially...
By BMA ADMIN 2025-05-19 12:13:51 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com