నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత...

0
161

భారత్ అవాజ్ న్యూస్: 31 జూలై వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బిఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) గురువారం అర్ధరాత్రి12:51 ని" కన్నుమూశారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈనెల 26న హనుమకొండ హంటర్ రోడ్డులోని తన నివాసంలో ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర మైన వైద్యచికిత్సలు అందించారు. దాదాపు గంటపాటు సీపీఆర్ చేశాక ఆయన స్పందించారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో బ్లాక్ లు ఏర్పడినట్టు స్థానిక డాక్టర్లు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గ్రీన్ చానెల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటుచేసి సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఎక్మో(ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) విధానంలో నిపుణులైన వైద్యుల సహాయంతో అత్యాధునిక వైద్యచికిత్సలు అందించారు. కాగా, పెద్ది సుదర్శన్రెడ్డికి మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి వైద్యులను చేతులెత్తి వేడుకున్నారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి యశోద ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కేటీఆర్, టి.హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయినా డాక్టర్ల కృషి ఫలించలేదు. చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తుదిశ్వాస విడిచారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో...
By Chennaiah Kati 2026-07-14 19:23:51 0 145
Andhra Pradesh
పుంగనూరు: మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సహాయం
పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి...
By Kothuru Murali 2026-04-29 11:18:38 0 265
BMA
Defying Draconian Laws: The Courage of the Reporter
The psychological and moral strength of the press is most visible when journalists endure extreme...
By JoinBMA 2026-08-21 10:34:07 0 132
Telangana
కేంద్ర మంత్రి గారి సుపుత్రుడు కేసులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే అంశాలు -తులసి చందు
కేంద్ర మంత్రి గారి సుపుత్రుడు కేసులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే అంశాలు - చట్ట ఉల్లంఘనలు ఎన్ని...
By Ponnala Srinivasrao 2026-05-16 05:23:17 1 182
Andhra Pradesh
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?...
By Karapati Gopi 2025-12-30 03:39:26 0 425
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com