కేంద్ర మంత్రి గారి సుపుత్రుడు కేసులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే అంశాలు -తులసి చందు

1
182

కేంద్ర మంత్రి గారి సుపుత్రుడు కేసులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే అంశాలు - చట్ట ఉల్లంఘనలు ఎన్ని ఉన్నాయో ఎవరూ మాట్లాడటం లేదు. చట్టం తెలుసుకోవటం అందరికీ తప్పనిసరి కనుక, ఈ కేసులో జరిగిన పరిణామాలపై ఒక విశ్లేషణ:

‎1. బాధితురాలి కుటుంబం ఒక లాయర్ని సంప్రదించగా ఆ లాయర్ సదరు సుపుత్రుని కన్న మంత్రిగారికి విషయం చెప్పాడు. ఎందుకు చెప్పాడు - ఏ ఉద్దేశం తో చెప్పాడో అనవసరం. ఒక లాయర్ అయివుండి అవతలి పక్షానితో - అందులోనూ ఒక నిరారోపితుడితో మాట్లాడటం నేరం. అందులోనూ పోక్సో చట్టంలో పెద్ద నేరం! పోక్సో చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం: పోక్సో నేరం జరిగింది/జరగబోతుంది/జరిగివుండవచ్చు అని సమాచారం ఉన్న ఎవరైనా ముందు పోలీసులకి, నిర్ణీత అధికారులకు పిర్యాదు చేయాలి. అలా చేయకపోతే సెక్షన్ 21 ప్రకారం శిక్ష ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది. సాధారణ వ్యక్తికి చట్టం తెలియదు అంటే అనుకోవచ్చు… ఒక లాయర్ అంటే చట్టం తెలిసినవాడు అని అర్థం. అలా తెలిసి కూడా, నేరారోపితుడుతో రాయబారం నడపడం దేనికోసం? వసూళ్ళ కోసమా? లేక ముందుగానే బాధితురాలని నేరస్తురాలని చేయడానికా? ఈ ఎఫ్.ఐ.ఆర్ లోని పిర్యాదు చూస్తే ఇంకా కోపం వస్తుంది. ఒక లాయర్ ఉండి మరీ ఇలాంటి దిక్కుమాలిన కంప్లైంట్ ఇస్తారా??? నేరస్తుని సగౌరవంగా విడిచేసేలాగా ఉంది ఆ కంప్లైంట్!! ఈ స్టేజిలో ఇంతకంటే ఎక్కువ చెప్పను.

‎…… ఈ మధ్య యూట్యూబ్ లో పెయిడ్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ, ఈరోజు కోర్టు ముఖం కూడా చూడని, వాదన వాసన కూడా తెలియని సగం సూటు గాళ్ళని కూడా లాయర్ అనాల్సి వస్తుంది. జనాలు కూడా వీళ్ళని పెద్ద మేధావులు అనుకుంటున్నారు. ఈ పెయిడ్ లాయర్లను ఎలా గుర్తుపట్టాలో మరొక సందర్భంలో చెప్తాను. 

‎2. జర్నలిస్టు సంగప్ప: ఈయన కూడా రాయబారం నడిపారు అని బాధితురాలు తల్లి తన లేఖలో పేర్కొంది. ఈ రెండు నిజాలైతే…. ఆ యూట్యూబ్ లాయర్ పైన, ఈ మాజీ జర్నలిస్టు పైన కూడా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలి. ఈ కేసులను నమోదు చేయమని ఎవరూ అడగాల్సిన అవసరం లేదు. పోలీసులకు ఈ విషయాలు తెలుసు. శిశు సంక్షేమ శాఖ వారు చొరవ తీసుకొని కూడా ఈ కేసులు నమోదు చేయించవచ్చు.

‎3. నోటీసులు: పోక్సో కేసు నమోదు అయిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని కేసులలో నిందితునికి నోటీసులు ఇచ్చి పోలీసు వారు హాజరు కమ్మని అడిగారు? అసలు పోక్సో చట్టంలో ఇలా నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు! నేరుగా సదరు వ్యక్తిని అరెస్టు చేసి, మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. రిమాండ్కు పంపి విచారణ కోసం పోలీస్ కస్టడీ కోరాలి. చిన్నచిన్న నేరాలలో కూడా రిమాండ్కు పంపించే పోలీసులు - ఈ కేసులో నోటీసులు ఇవ్వడం అంటే ఎవరో చెప్తే చేస్తున్నట్లుగానే ఉంది. ఏదో చేస్తున్నామని చూపించుకోవాలి కాబట్టి! 

‎4. బాధితురాలు వయసు: బాక్స్ చట్టంలో బాధితుల వయసు చాలా ముఖ్యమైన అంశమే. అయితే మైనర్ వయసు నిర్ధారణ ఎలా చేయాలి అనే అంశం గురించి పోక్సో చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అందుకని జోనల్ జస్టిక్స్ చట్టంలోని సెక్షన్ 94, జూలై జస్టిస్ చట్టం రూల్స్ ఆధారంగా మైనర్ వయసుకు గల ప్రామాణికాన్ని చూస్తూ వచ్చాయి కోర్టులు. దాని ప్రకారం మొదటి ప్రాధాన్యత స్కూల్ సర్టిఫికెట్లకు ఉంటుంది. మొదట స్కూల్లో చేర్పించిన రికార్డు లేదా పదవ తరగతి రికార్డు మొదటి ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ స్కూల్ రికార్డులు అందుబాటులో ఉంటే వేరే రికార్డులు చూడడం అనవసరం. ఒకవేళ వేరే రికార్డులు ఉన్నాయి అనుకుంటే - మైనర్ వయస్సును చాలెంజ్ చేస్తూ, ట్ట్రయిల్ (క్రాస్ ఎగ్జామినేషన్) సమయంలో నిజాన్ని వెలికి తీయవలసి ఉంటుంది. కేసు నమోదు చేసినప్పుడు లేదా బెయిల్ ఇచ్చే సమయంలో - స్కూల్ రికార్డులు ఉంటే, వయసు గురించిన వైరుధ్యం అనవసరం. ఈ కేసులో ప్రస్తుతానికి స్కూలు రికార్డు ఏం చెబుతుంది అనేది ప్రమాణికంగా తీసుకోవాలి తప్ప వేరే రికార్డులు కాదు. ఏది ఏమైనా, 2008 నాటి బర్త్ సర్టిఫికెట్ ఒకటి ఉంది అంటున్నారు కాబట్టి: ఆ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ, నేరం జరిగిన నాటికి బాలిక వయసు 18 కన్నా తక్కువే. కాబట్టి, ఏ వైపు నుంచి చూసినా ఫోక్సో చట్టం వర్తిస్తుంది అని బెయిల్ సమయంలో కోర్టులు భావించాలి.

‎5. విక్టిమ్ బ్లేమింగ్ & ఫోటోలు : బాధితురాలే తప్పు చేసింది అని విపరీతమైన ప్రచారం చేయటం, కోర్టు సాక్షిగా కూడా ఈ విక్టిమ్ బ్లేమింగ్ చేయటం హేయమైన చర్య. ఇలా చేసేవాళ్ళు అసలు మనుషులే కాదు అని నా అభిప్రాయం. పోక్సో చట్టంలో అయినా, జువెనైల్ చట్టంలో అయినా… మైనర్ ఫోటోలు, పేర్లు, వివరాలు చెప్పడానికి వీల్లేదు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇదికూడా నేరమే! 

‎6. జడ్జిగారిపై ఆరోపణలు: ప్రతికేసులో జడ్జిలు - లాయర్లు అమ్ముడు పోతారు అనే ధోరణి ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. జడ్జిపై ఒత్తిడి తేవడం మంచిది కాదు. ఈ కేసులో సైతం బెయిల్ వింటున్న జడ్జి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఊరు పేరు లేని ఒక పత్రికలో వ్యాసం వ్రాయించి, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. ఇది చాలా ఇబ్బందికరమైనది, ప్రమాదకరమైనది కూడా. ఒకవేళ పలానా జడ్జీ నా కేసు వినకూడదు అనుకుంటే : రెక్యూసల్ అడగవచ్చు. అంతేగానీ వ్యక్తిగత దుష్ప్రచారం సరి కాదు.

‎పోలీసులకు నా సూచన: పైన చెప్పిన వారిపై వెంటనే కేసులు పెట్టండి.

Search
Categories
Read More
BMA
Secondhand Trauma: The Hidden Risk in Media Verification
Just as firsthand exposure to violence can trigger PTSD, continuously viewing graphic digital...
By JoinBMA 2026-08-21 11:29:46 0 331
Andhra Pradesh
ముగతి గ్రామంలో వరుసగా ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం చాలా బాధాకరం.
ముగ్గురు అన్నదమ్ముల వరుస మరణాలు… ముగతి గ్రామం శోకసంద్రం నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకే...
By Boya Dasthagiri 2026-03-29 13:42:42 0 1K
Jharkhand
Palamau Tiger Reserve: Urgent Conservation Needed
A recent report highlights a critical concern for the Palamau Tiger Reserve. While India's...
By Lokeshwari Panthadi 2026-07-02 04:59:08 0 87
SURAKSHA
AI Cameras and Drones Make Karnataka Roads Safer Every Day
Karnataka Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-01 11:07:58 0 98
Telangana
జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మరియు డిఇఓ లుపాఠశాలలు పరిశీలన
భూపాలపల్లి (భారత్ ఆవాజ్ న్యూస్): జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం భూపాలపల్లి మండలం...
By BURRA KIRANKUMARA 2026-09-16 09:00:01 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com