ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సందీప్ నగర్‌లో కల్వర్టు నిర్మాణం పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
Posted 2026-07-26 11:14:47
0
309
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్ నగర్ కాలనీలో ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న కల్వర్టు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. కల్వర్టు లేకపోవడం వల్ల కాలనీ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ నిరంతరం పర్యవేక్షించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పనులు పూర్తయ్యాయి.కల్వర్టు అందుబాటులోకి రావడంతో రాకపోకలు సులభతరమయ్యాయని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ కమిషనర్‌కు, అధికారులకు, పనులు పూర్తి చేసిన సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిరంతరం శ్రమిస్తున్న కౌన్సిలర్ రాపర్తి కార్తీక్‌ను కాలనీ ప్రజలు ఘనంగా అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు
06-02-2026 Fri...
TN Cops Today: Mentors For Next Generation Force
Today senior and retired TN police officers mentored new recruits. At training centers, they...
ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి: బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
బాపట్ల: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్...
విశాఖ లో జన తా వారిధి
విశాఖ పట్నం కలెక్టరేట్ వద్ద సోమ వారం ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు బీజేపీ నాయకులు జనతా...
పెద్దపల్లి లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్...!
పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే...