కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు

0
226

కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు

కూటమి సుపరిపాలన శాశ్వతంగా కొనసాగాలంటే ఇంటింటికీ వెళ్లాలి - టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి మాణిక్యరావు గారు

గుంటూరు పశ్చిమ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు, కూటమి సుపరిపాలన శాశ్వతంగా కొనసాగాలంటే ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి మాణిక్యరావు గారు పిలుపునిచ్చారు.

బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ పిల్లి మాణిక్యరావు గారు, ఏపీటీఎస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహనకృష్ణ గారు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లె ఈశ్వర్ గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు, సీనియర్ నాయకులు శ్రీ నిమ్మల శేషయ్య గారు తదితరులు పాల్గొన్నారు.

తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల మరణించిన 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు కీ.శే. బత్తుల రమణమ్మ గారికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా జూలై 27 నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు తెలుగుదేశం పార్టీ బలోపేతం, కార్యకర్తల బాధ్యతలు, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరంపై విస్తృతంగా మాట్లాడారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ప్రజల మధ్య నిరంతరం ఉండే నాయకత్వమే విజయాన్ని సాధిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రత్యర్థుల బలం కాదని, ప్రజలతో అనుసంధానం తగ్గిపోవడమేనని అన్నారు.

తెలుగుదేశం పార్టీ సాధారణ రాజకీయ పార్టీ కాదని, పేదవారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ అని పేర్కొన్నారు. జూలై 27 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్ కమిటీ, ప్రతి బూత్ ఇన్‌చార్జి, ప్రతి నాయకుడు ప్రజల ఇళ్లకు వెళ్లి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో సాధించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ప్రతి ఇంటికి కరపత్రాలు అందించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని, క్రియాశీలకంగా పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీ పిల్లి మాణిక్యరావు గారు మాట్లాడుతూ... గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టిందని అన్నారు. పోలవరం, అమరావతి, పరిశ్రమల రాక, ఉద్యోగాల కల్పన, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే దుష్ప్రచారానికి అవకాశం కలుగుతుందని, అందుకే ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించాలని పిలుపునిచ్చారు. రోజుకు కనీసం 30 ఇళ్లను సందర్శిస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన శాశ్వతంగా కొనసాగాలంటే ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో శ్రీ మన్నవ మోహనకృష్ణ గారు, శ్రీ మల్లె ఈశ్వర్ గారు, శ్రీ తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు, శ్రీ నిమ్మల శేషయ్య గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల సరికొత్త తనిఖీలు
30/5/26న అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ సరికొత్త తనిఖీలకు శ్రీకారం...
By Kothuru Murali 2026-05-31 16:20:27 0 123
Andhra Pradesh
అన్నమయ్య ​జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా విజిబుల్ పోలీసింగ్: SP.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా శనివారం 'విజిబుల్ పోలీసింగ్'...
By Pagadala Venkateswar 2026-03-15 03:57:07 0 183
Puducherry
Puducherry Safety Shield: New Helplines For Women & Children
The Government of Puducherry has taken a significant step towards reinforcing social security...
By Lokeshwari Panthadi 2026-06-30 10:37:14 0 80
Telangana
“నాయకుల చేతుల్లో ఎకరాలు పెరుగుతున్నాయి.. సామాన్యుడి చేతుల్లో మాత్రం EMIలు ఎందుకు పెరుగుతున్నాయి?” శ్రీను రావు పొన్నాల
తెలంగాణలో సామాన్యుడి బతుకు ఎప్పుడు మారుతుంది? ‎హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు...
By Ponnala Srinivasrao 2026-09-19 04:36:20 0 51
Andhra Pradesh
పర్యాటకులకు ప్రత్యేక యాప్ ఆంధ్ర టాక్సీలో హాయి హాయిగా వివరిద్దాం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 25, 2025*...
By Rajini Kumari 2025-12-25 11:20:25 0 314
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com