“నాయకుల చేతుల్లో ఎకరాలు పెరుగుతున్నాయి.. సామాన్యుడి చేతుల్లో మాత్రం EMIలు ఎందుకు పెరుగుతున్నాయి?” శ్రీను రావు పొన్నాల

0
43

తెలంగాణలో సామాన్యుడి బతుకు ఎప్పుడు మారుతుంది?

‎హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా, సామాన్య ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు ఎంతవరకు వచ్చిందనే ప్రశ్నను శ్రీను రావు పొన్నాల లేవనెత్తారు. ప్రభుత్వాలు మారుతున్నాయి..పార్టీలు మారుతున్నాయి.. నాయకులు మారుతున్నారు.. కానీ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

‎నాయకులు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, బయటకు వచ్చి రాజకీయ విమర్శలు చేయడం కాకుండా.. ఒక సాధారణ కుటుంబం ఎలా బతుకుతోంది? అనే విషయంపై చర్చ జరగాలని అన్నారు.

‎నెల జీతం వచ్చిన వెంటనే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్లు, ఇంటి ఖర్చులు, వైద్యం, ప్రయాణ ఖర్చులు, బ్యాంకు లోన్ల EMIలు కట్టిన తర్వాత మధ్యతరగతి కుటుంబం చేతిలో ఎంత మిగులుతుందో నాయకులు ఆలోచించాలన్నారు.

‎“నాయకుల చేతుల్లో ఎకరాలు పెరుగుతున్నాయి.. సామాన్యుడి చేతుల్లో మాత్రం EMIలు ఎందుకు పెరుగుతున్నాయి?” అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

‎రైతుకు పంట ఖర్చులు, యువతకు ఉద్యోగాల కోసం ఎదురుచూపులు, చిన్న వ్యాపారులకు పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగులకు కుటుంబ బాధ్యతలు, మధ్యతరగతి కుటుంబాలకు పిల్లల చదువులు, ఇల్లు, వైద్యం వంటి సమస్యలు రోజురోజుకూ భారంగా మారుతున్నాయని అన్నారు.

‎తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్ద భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు మాత్రమే కాకుండా.. ఒక సాధారణ కుటుంబం నెలాఖరును అప్పు చేయకుండా ఎలా గడుపుతోంది? అనేదే అసలైన ప్రశ్నగా ఉండాలని శ్రీను రావు పొన్నాల అన్నారు.

‎పార్టీలు మారాయి.. పాలకులు మారారు.. ప్రభుత్వాలు మారాయి.. కానీ “సామాన్యుడి బతుకులో ఎంత మార్పు వచ్చింది?” అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని పేర్కొన్నారు.

‎ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి? యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? రైతుకు ఎంత భరోసా లభించింది? మధ్యతరగతి కుటుంబానికి జీవితం ఎంత సులభమైంది? అనే అంశాలపై రాజకీయ పార్టీలు ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు.

‎చివరగా “ఇదేనా మనం కలలుగన్న తెలంగాణ?” అంటూ శ్రీను రావు పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ లెక్కల్లో కనిపించే అభివృద్ధి కాకుండా, ప్రతి సామాన్యుడి ఇంట్లో కనిపించే సంతోషం, భద్రత, ఆర్థిక స్థిరత్వం కావాలని ఆయన పేర్కొన్నారు.

‎— శ్రీను రావు పొన్నాల

‎Bharat Aawaz

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: హిందూ సమాజాన్ని జాగృతోచేయ rss కిలక పాత్ర.
హిందీసమాజాన్ని జాగృతం చేయడములో ఆర్ఎస్ఎస్ పాత్ర కిలకమణి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ...
By Sadaq Sadaq 2026-03-19 17:06:00 0 223
SURAKSHA
Saugat Biswas IAS: Driving Governance with Excellence
A distinguished 2006-batch AGMUT cadre IAS officer, Saugat Biswas has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-08-03 05:34:32 0 232
Andhra Pradesh
మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి...
బాపట్ల: మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని...
By Gadiyapudi Narendra 2026-01-20 12:27:21 0 247
Andhra Pradesh
అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం
*అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం చేసినా కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం*   *అప్పుడు,...
By Rajini Kumari 2025-12-29 13:16:07 0 249
Andhra Pradesh
గిరిజనుల వినూత్న నిర్ణయం అతిక్రమిస్తే "రెండు లక్షలు" జరిమానా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాలు తమ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను...
By Shyamala Yadagiri 2026-05-14 06:10:42 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com