ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు. స్వయంగా పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్
Posted 2026-07-22 15:19:12
0
273
ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్ గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు ఫాగింగ్ పనులను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని, ప్రజలు ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!
చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం...
బొబ్బిలి:నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామ ప్రజలు 4రోజులుగా నీటికొరతతో ఇబ్బందులు పడుతున్నారు....
మొబైల్ ఫోన్స్ కొనేవారికి షాక్ !!!
వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్ల ధరలు భారీ పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు AI...
చీరాలలో అంగన్వాడీల నిరసన...
చీరాల: సీఐటీయూ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్‌లో ఆందోళనబాపట్ల జిల్లా చీరాల గడియారస్థంభం...
నిజామాబాద్
స్వాతంత్ర్యం ఒక హక్కు మాత్రమే కాదు.. ఒక బాధ్యత కూడా!
మన దేశం కోసం మన వంతు కృషి చేద్దాం....