చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!

0
239

చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన అఖిల్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పొల్లూరు జలపాతాన్ని సందర్శించడానికి వచ్చాడు. అందరూ కలిసి జలపాతం అందాలను ఆస్వాదిస్తూ, నీటిలో కేరింతలు కొడుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. అఖిల్ ప్రమాదవశాత్తు జలపాతంలోని లోతైన నీటి గుండంలో పడి మునిగిపోయాడు.కళ్లముందే అఖిల్ నీటిలో మునిగిపోతుండడం గమనించిన స్నేహితులు వెంటనే అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. నీటిలో మునిగి ఊపిరాడక అఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు స్థానికులు నిర్ధారించారు.కళ్లముందే ప్రాణస్నేహితుడు శవంగా మారడంతో తోటి స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొతుగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
నారాయణపేట జిల్లాలో దారుణ 
భరత్ అవాజ్  సూర్యమోహన్        నారాయణపేట జిల్లాలో దారుణ ...
By Vanmoj Suryamohan 2026-07-24 02:37:00 0 183
Bihar
Bihar Strengthens Women and Child Welfare Initiatives
Bihar continues to expand women and child welfare initiatives through programs focused on...
By Fathima Safa 2026-07-03 14:47:21 0 121
Telangana
‎ ‎ ‎‎*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*
గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది...
By Ponnala Srinivasrao 2026-03-13 04:36:30 0 332
SURAKSHA
Khilli Ram Meena: Steering Mizoram with Vision & Integrity
A distinguished 1993-batch AGMUT Cadre IAS officer, Khilli Ram Meena serves as the Chief...
By Lokeshwari Panthadi 2026-07-23 11:03:33 0 173
Karnataka
Sigandur Bridge Opens — Karnataka’s Longest Cable-Stayed Marvel
Karnataka celebrated the inauguration of its longest inland cable-stayed bridge, the 2.25 km...
By Bharat Aawaz 2025-07-17 06:43:51 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com