తెలుగుదేశం పార్టీలో చేరిన 150 వైసీపీనుండి కార్యకర్తలు

0
257

*అన్నమయ్య జిల్లా*

*రాయచోటి నియోజకవర్గం*

*లక్కిరెడ్డిపల్లె మండలం*

*18-07-2026*

 

*మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం... దప్పేపల్లెలో 150 మంది టీడీపీ గూటికి*

 

*తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*

 

లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామానికి చెందిన *మాజీ ఎంపీటీసీ,మాజీ జడ్పీటీసీ అంబా బత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు* తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాహిత పాలనకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు.

 

ఈ సందర్భంగా *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు* నూతనంగా పార్టీలో చేరిన వారికి *పార్టీ కండువాలు* కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

 

మంత్రి గారు మాట్లాడుతూ, *ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో* రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితంగానే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా *తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని* పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బలిశెట్టి హరిప్రసాద్ గారు, *మండల పార్టీ అధ్యక్షులు మదన్ మోహన్ గారు,* ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారిని అభినందించారు.

Search
Categories
Read More
Telangana
మల్కాజిగిరి కమిషనరేట్‌కు అంబులెన్స్ అందజేత.|
"అల్లూరి జయంతి వేడుకల్లో ప్రజాసేవకు మరో తోడ్పాటు" హైదరాబాద్,జూలై 4:మన్యం వీరుడు అల్లూరి...
By Sidhu Maroju 2026-07-04 11:22:05 0 102
Andhra Pradesh
ఏపీలో పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు.. 18 వరకు ఛాన్స్ | AP
Application Deadline పొడిగించారు. ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం...
By VALLERU SIMHADRI 2026-09-16 05:46:06 0 131
Telangana
తెలంగాణ సాగునీటి రంగానికి ఆర్. విద్యాసాగర్ రావు గారి సేవలు అనిర్వచనీయం.. kcr
ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. ‎సమైక్య...
By Ponnala Srinivasrao 2026-04-29 03:29:58 0 189
Andhra Pradesh
కనకమెడల రవీంద్ర కు అభినందనలు తెలిపినmP కేశినేని గద్దె రామ్మోహన్
*ప్రచుర‌ణార్థం* *24-12-2025*   క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకు...
By Rajini Kumari 2025-12-25 07:40:40 0 218
SURAKSHA
Shri Sudhanshu Kumar, IPS: A Visionary Leader in Modern Policing
A 1996-batch Bihar cadre IPS officer whose commitment to professional policing, technology-driven...
By Kalaga Sailaja 2026-07-24 07:48:41 0 350
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com