నిజామాబాద్

0
116

*ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గాజులపేట్, బుదవార్పేట్ బంగాల్పేట్, బెస్తవార్పేట్, మార్కెట్, బాగులవాడ, భాగ్యనగర్ బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో సమీక్ష*

ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ గారు, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ కూచాడి శ్రీహరి రావు గారు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి గారు నిర్మల్ పట్టణంలోని గాజులపేట్, బుదవార్పేట్, బంగాల్పేట్, బెస్తవార్పేట్, గులజార్ మార్కెట్, బాగులవాడ, భాగ్యనగర్లను సందర్శించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో సమావేశమై ఓటరు నమోదు, పేర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎలాంటి అర్హులైన ఓటరు జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.ఓటరు నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను బీఎల్‌వోలు, బీఎల్‌ఏలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పౌర్ణమి సందర్భంగా శ్రీ బోయకొండ దేవస్థానంలో చండీహోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ...
By Kothuru Murali 2026-06-29 11:32:12 0 185
Telangana
జిహెచ్ఎంసి లో కలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి  జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
By Ponnala Srinivasrao 2026-07-12 06:20:14 0 211
Telangana
"తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.  190...
By Sidhu Maroju 2026-05-23 18:45:04 0 288
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్
*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*   *ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్...
By Rajini Kumari 2025-12-15 07:41:35 0 265
SURAKSHA
Gujarat’s Sentinel: The Inspiring Journey of Vikas Sahay
Uncompromising Integrity, Visionary Security Leadership, and Dedicated Service to the Nation In...
By Kalaga Sailaja 2026-07-28 13:13:25 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com