138 డివిజన్లో మైనారిటీలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

0
1K

ఈరోజు అనగా 11-06-2025, బుధవారం రోజున, కుషాయిగూడ మైనార్టీ పాఠశాల వద్ద , మన ప్రియతమ నాయకులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతన్న ఆదేశాల మేరకు మౌలాలి డివిజన్లోని పేద,పథకానికి అర్హత గల ముస్లిం మైనార్టీ సోదరిమనులకు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మౌలాలి డివిజన్లో దాదాపుగా 35 కుట్టుమిషన్లు అర్హత గల వారికి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మహిళల స్వయం ఉపాధి కి, మహిళ సాధికారతను పెంపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు ఆశ, ముస్లిం మైనార్టీ నాయకులు గౌస్ బాయ్, ఫరీద్ భాయ్, హమీద్ బాయ్ , డివిజన్ అధ్యక్షులు సంపత్ గౌడ్, సయ్యద్.యూసుఫ్ బాయ్, సయ్యద్,మబ్బు, నయీం ఖాన్,ఎం డి అలీ, ముబసీర్ బాయ్, మరి ఇతర సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి 138 సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న, హమీద్, ఫారూఖ్, మంద భాస్కర్, సలీం, షకీల్, పైసల్, పాండురంగ చారి, మహమూద, అజయ్, శివ, ఇంతియాజ్, యూసుఫ్, పద్మ, కాసింబి, ఇర్ఫాన్ , మల్లేష్, నరసింహ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Bharat Aawaz
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...
By Bharat Aawaz 2025-06-28 12:13:28 0 1K
Andhra Pradesh
అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణకు శ్రీకారం |
తిరుమల అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణకు పురావస్తు శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.4...
By Bhuvaneswari Shanaga 2025-10-23 10:40:31 0 43
Andhra Pradesh
ఆంధ్రలో ₹3,000 కోట్లతో నూతన పరిశ్రమలు |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి మరో కీలక అడుగు వేసింది. తిరుపతిలో ప్రైవేట్ ఉపగ్రహ...
By Bhuvaneswari Shanaga 2025-09-30 11:28:02 0 31
Rajasthan
राजस्थान सरकार ने IAS, IPS और IFS अधिकारियों की केंद्र प्रतिनियुक्ति पर रोक लगाई
राजस्थान सरकार ने #IAS, #IPS और #IFS अधिकारियों की #केंद्र_प्रतिनियुक्ति पर रोक लगा दी है। इस...
By Pooja Patil 2025-09-13 08:19:13 0 136
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com