(SIR)ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
317

ఆసిఫాబాద్, జూలై 11 : భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆసిఫాబాద్ పట్టణంలోని ఓడపల్లి గార్డెన్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు సరైన అవగాహన ఉండటం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల జాబితా ప్రతి అర్హుడైన ఓటరిని ప్రతిబింబించేలా ఉండాలంటే ఎన్నికల సంఘం చేపట్టే ప్రతి ప్రక్రియపై ప్రజలు అవగాహన కలిగి ఉండటంతో పాటు బాధ్యతాయుతంగా సహకరించాలని ఆయన కోరారు,ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటరు నమోదు, వివరాల ధృవీకరణ, అవసరమైన సవరణలు, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశాలు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు,

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కు అని పేర్కొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవడంతో పాటు ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు,ఆ కార్యక్రమంలో ప్రజలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు.

Search
Categories
Read More
Telangana
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు  ...
By Pinnehasan Odela 2026-03-06 14:06:20 0 264
Andhra Pradesh
Nitin Gadkari: ఏపీకి శుభవార్త చెప్పిన నితిన్ గడ్కరీ.
Andhra   Gadkari good news for Andhra Pradesh మచిలీపట్నం పోర్టుకు రూ. 573.77 కోట్లతో...
By Pagadala Venkateswar 2026-02-06 04:48:14 0 224
Andhra Pradesh
చింతూరు: అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి!
చింతూరు మండలం తిమ్మరిగూడెం గ్రామానికి చెందిన సునీత అనే గర్భిణికి శనివారం అకస్మాత్తుగా ప్రసవ వేదన...
By Shyamala Yadagiri 2026-05-30 07:23:52 0 249
Andhra Pradesh
పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ...
By Kothuru Murali 2026-03-13 03:47:30 0 183
SURAKSHA
AP Police 108 Emergency Response Saves Accident Victim Life
Guntur lo road accident jarigina ventane AP Police 108 ki call chesi injured person ni hospital...
By Kalaga Sailaja 2026-07-01 04:39:13 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com