రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి

0
1K

కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిపిఐ మండల కార్యదర్శి బి.రాజుఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు రాజు రాముడు డిమాండ్ చేశారు. సోమవారం కోడుమూరులో తాసిల్దార్ వెంకటేష్ నాయక్ కు ఏపీ రైతు సంఘం తరఫున సిపిఐ మండల కార్యదర్శి బి రాజు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన కూడా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ అందజేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు 90 శాతం సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలను అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా పే ఆఫ్ స్కేల్ ఫైనాన్స్ కింద పంట రుణాలను ఐదు లక్షలకు పెంచాలి. గ్రామసభలు నిర్వహించి భూ యజమానుల ప్రమేయం లేకుండా కౌలు రైతులకు కౌలు కార్డులు అందజేయాలి. కౌలు రైతులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా 2 లక్షల వ్యవసాయ పంట రుణాలను ఎలాంటి పూచి కతూ లేకుండా ఇవ్వాలి. కౌలు రైతుల రక్షణ సంక్షేమం కొరకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు రిజర్వాయర్లు ప్రధాన కాలువలు చెరువులను మరమ్మత్తులు చేపట్టి వ్యవసాయ అనుగుణంగా తక్షణ పనులు చేపట్టాలి. వరి పంటకు పక్క రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్లో కూడా క్వింటాలకు అదనంగా 500 రూపాయలు చెల్లించాలి డిమాండ్ చేస్తున్నాం. పామాయిల్ దిగుమతి పై సుoఖాన్ని విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం పునః సంక్షించాలి. ఫ్రూట్ జ్యూస్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన 40 శాతం జీఎస్టీని తక్షణమే ఉపసంహరించాలని కోరుతున్నాం. డాక్టర్ స్వామినాథన్ సిఫార్చేసిన వ్యవసాయ పనుల కనుగుణంగా అమలు చేయాలి. సబ్సిడీ కింద రైతులకు వ్యవసాయ పరికరాలను విరివిగా అందించాలి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మద్దిలేటి,ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రంగస్వామి, రైతులు కౌలుట్ల తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
53 ఏళ్ల క్రితమే భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనం |
ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రపంచమంతా దృష్టి పెట్టిన వేళ, 53 ఏళ్ల క్రితమే ఓ తెలుగుబాబు దేశంలో...
By Bhuvaneswari Shanaga 2025-10-11 04:47:09 0 31
International
సరిహద్దు ఘర్షణలతో పాక్‌ దూరంగా |
అఫ్గానిస్థాన్‌తో పాకిస్థాన్ సంబంధాలు అధికారికంగా నిలిపివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా...
By Bhuvaneswari Shanaga 2025-10-14 11:57:32 0 29
Andhra Pradesh
జగన్‌ పర్యటనపై పోలీసుల గట్టి హెచ్చరిక |
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం పర్యటనకు సంబంధించి పోలీసులు కీలక హెచ్చరిక...
By Bhuvaneswari Shanaga 2025-10-09 04:33:49 0 27
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com