బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ మాగంటి గోపీనాథ్ కన్నుమూత

0
1K

మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పని చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఐదు గంటల 45 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. ఏఐజి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. M గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత, ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.మాగంటి గోపినాథ్ 2022 జనవరి 26న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

Search
Categories
Read More
Telangana
మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.
 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి...
By Sidhu Maroju 2025-07-06 17:03:01 0 987
Odisha
🛕 పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తుల పోటెత్తు – భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా
ఒడిశా, పూరీ: జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర మహోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. వేల ఏళ్లుగా...
By Bharat Aawaz 2025-06-27 07:58:21 0 1K
Andhra Pradesh
విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి జిల్లా మలేరియా అధికారి నూకరాజు
గూడూరు పట్టణంలోని కేజీబీవీ స్కూల్లో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా మలేరియా అధికారి...
By mahaboob basha 2025-10-25 14:50:51 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com