బాబూ జగ్జీవన్ రామ్‌కు ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళి.!

0
132

"పికెట్‌లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి"

మేడ్చల్ మల్కాజిగిరి : భారత మాజీ ఉపప్రధాని, నవభారత నిర్మాత బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పికెట్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ రాజకీయాలు, సామాజిక సేవలో బాబూ జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవానికి విశేష కృషి చేసి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ పిలుపునిచ్చారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
A P in tirupathi royal Enfield project
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో...
By G k Nookala 2026-05-18 17:24:46 0 238
Telangana
మళ్ళీ ఎన్నికలు
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
By Krishna Balina 2025-12-18 00:33:50 0 306
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:గాజుల పల్లెలో వ్యక్తిపై కొడవలితో దాడి
రొంపిచర్ల(M) గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు...
By Kothuru Murali 2026-04-02 06:46:37 0 196
Telangana
నిజామాబాద్
గౌరవ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా,...
By Sadaq Sadaq 2026-06-11 05:29:14 0 178
Telangana
దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల...
By Gujile Ramu 2026-08-26 01:09:38 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com