పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం

1
138

పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం!

దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , డా కడియాల లలిత్ సాగర్ గార్లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్ అందించి, కరెంట్ బిల్లుల భారం తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పీఎం సూర్యఘర్ పథకం సమర్థవంతంగా అమలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ మండల అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు వల్లెపు నారాయణ, ఎలుగొండారెడ్డి, టీడీపీ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, సానే సుబ్బయ్య, రామచంద్రాపురం గ్రామ నాయకులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మార్వో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో పార్వతి సోమవారం మండల వీఆర్వోలు,...
By Kothuru Murali 2026-01-13 09:00:49 0 214
Telangana
నిజామాబాద్
గత ఎనిమిది రోజులుగా వంశీ అపార్ట్మెంట్ సమీపంలో డ్రైనేజ్ జామ్ కావడంతో మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి...
By Sadaq Sadaq 2026-05-28 04:00:17 0 124
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెకు చెందిన విజయ భారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతును బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమించారు.
మదనపల్లె: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా విజయ భారతి...
By Pagadala Venkateswar 2026-08-15 05:20:26 0 87
Andhra Pradesh
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:52:50 0 724
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com